Corona Vaccination: జంటనగరాల్లో పెద్ద ఎత్తున మొదలైన కరోనా వ్యాక్సినేషన్స్పెషల్ డ్రైవ్.. వెళ్లి టీకా వేయించుకోండి మరి
గ్రేటర్ హైదరాబాద్‌లో నేటి నుంచి పెద్ద ఎత్తున వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 4,846 కాలనీలు, బస్తీలతో పాటు
Covid -19 vaccination: గ్రేటర్ హైదరాబాద్‌లో నేటి నుంచి పెద్ద ఎత్తున వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 4,846 కాలనీలు, బస్తీలతో పాటు కంటోన్మెంట్‌లోని 360 బస్తీలు, కాలనీల్లో డ్రైవ్ కొనసాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 175 మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు టీకా కార్యక్రమం అమలు చేస్తున్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న నిపుణుల సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం టీకా పంపిణీ వేగవంతం చేసింది.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం స్వదేశంలో తయారైన టీకాలతో పాటు విదేశీ ఔషధ సంస్థలకు చెందిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజలకు టీకా ఆవశ్యకత పట్ల అవగాహన పెంచేందుకు అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజలు, అధికారులు.. ఒకరికొకరు కలసికట్టుగా తెలంగాణాని 100 శాతం వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.
భారతదేశంలో థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. అయితే ఉచిత సార్వత్రిక టీకాల కార్యక్రమం ప్రారంభమైన జూన్ 21 నుంచి టీకా ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. రాబోయే 10-15 రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేసిన నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.