Hyderabad: యూపీఐ పిన్ 1234 పెట్టుకున్న ఆటోడ్రైవర్.. ఫోన్‌తో పాటు సర్వం గల్లంతు
చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఏదైనా పాస్‌వర్డ్‌కి 1234 లాంటి ర్యాండమ్ నంబర్స్ పెడుతూ ఉంటారు. ఇది చెడ్డ అలవాటు మాత్రమే కాదు చాలా ప్రమాదకరం..
చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఏదైనా పాస్‌వర్డ్‌కి 1234 లాంటి ర్యాండమ్ నంబర్స్ పెడుతూ ఉంటారు. ఇది చెడ్డ అలవాటు మాత్రమే కాదు చాలా ప్రమాదకరం కూడా. గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని.. ఇలా చేస్తే మీ ఖాతాలు ఖాళీ అవుతాయి. తాజాగా ఓ ఆటో డ్రైవర్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కున్నారు. మొబైల్ ఫోన్‌లో యూపీఐ పిన్ 1234 పెట్టుకున్నాడు. అదే అతన్ని నిండా ముంచేసింది. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి ఏవీబీపురంలో నివసించే రాము ట్రాలీ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 13న మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఫోన్ చోరీ కావడంతో కూకట్‌పల్లి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అనుమానంతో తన బ్యాంకు ఖాతాను చెక్ చేశాడు. రూ.1.33 లక్షలు మాయం కావడంతో లబోదిబోమంటూ పోలీసులకు తెలియజేశాడు. ఆటోపై ఉన్న అప్పు తీర్చేందుకు చిట్టీ పాడిన డబ్బును ఎస్‌బీఐ అకౌంట్‌లో వేయగా ఆ సొమ్మంతా స్వాహా చేశారు కేటుగాళ్లు.
తన ఫోన్‌లో పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న అతను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేశాడు. అన్నింటికీ యూపీఐ పిన్ 1234 పెట్టాడు. అతని ఫోన్ చోరీ చేసిన నిందితుడు 1234 పెట్టి ఉంటాడని ఊహించి ఎంటర్ చేయడంతో సరిపోయింది. వెంటనే జ్యుయలరీ షాపులో గోల్డ్, డీమార్ట్‌లో షాపింగ్ చేశాడు. బ్యాంకు స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలు తెలిశాయి. బాధితుడి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డీమార్ట్, జ్యుయలరీ షాపుల్లో సీసీటీవీ ఫుటేజ్ కోసం పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. యూపీఐ పిన్‌ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలే ఈ ఘటన చాటిచెప్పింది.
వయసు 17.. చోరీలు 48
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ 17 ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్ హోంకు వెళ్లొచ్చినా పద్దతి మార్చుకోకపోవడంతో మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగి పగడాలపేటకు చెందిన మైనర్ 14 ఏళ్లకే దొంగతనాల బాటపట్టాడు. గతంలో కొన్ని కేసుల్లో జువైనల్ హోంకూ వెళ్లొచ్చాడు. బయటకు వచ్చి మళ్లీ ఇళ్లలో చోరీలు చేస్తున్నాడు. తాజాగా అగస్టు 8న తూరంగి ఏఎస్ఆర్ కాలనీలో మరికొందరితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. ఇందులోనూ ప్రధాన నిందితుడు ఈ బాలుడేనని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో బాలుడితో పాటు రాయుడు గోపాలకృష్ణ(31), చాట్ల రమేశ్‌ను(30) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని తెలిపారు. వారి నుంచి రూ. 1,35,000 విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
Also Read:తాలిబన్లని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతోన్న పంజ్‌షిర్ వాసులు.. అక్కడ అడుగుపెడితే వారికి చావే