AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్ లోకి మహిళలు ఎందుకొచ్చారనేదే ఇప్పుడు సస్పెన్స్

యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయ్. రాహుల్ ది హైప్రొఫైల్ మర్డర్ గా తెలుస్తోంది.

యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్ లోకి మహిళలు ఎందుకొచ్చారనేదే ఇప్పుడు సస్పెన్స్
Rahul Murder Case
Venkata Narayana
|

Updated on: Aug 23, 2021 | 9:57 AM

Share

Rahul murder case: యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయ్. రాహుల్ ది హైప్రొఫైల్ మర్డర్ గా తెలుస్తోంది. రాహుల్ కంపెనీలపై కన్నేసిన బడా బాబులు తెలివిగా మట్టుబెట్టారా? ప్రస్తుతం తెర ముందుకొచ్చినోళ్లు అసలు సూత్రధారులు కాదా? కుట్రధారులు వేరే ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు, హత్యకు మొయిన్ రీజనేంటి? ఈ ప్రశ్నలే ఇప్పుడు మిస్టరీగా మారాయి. అసలు, రాహుల్ ను ఎవరు చంపారు? దీని వెనుకున్న అసలు కుట్రదారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? రాహుల్ హత్యకు ప్లాన్ చేసిందెవరు? ఎగ్జిక్యూట్ చేసిందెవరు? ఎఫ్ఐఆర్ లో ఏముంది? ఆ ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.

రాహుల్ మర్డర్ సీన్ లోకి మహిళలు ఎందుకొచ్చారనేదే ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది. ఈ కేసులో ముగ్గురు మహిళల పేర్లు తెరపైకి వచ్చాయి. పద్మజ, గాయత్రి, పద్మజ. ఈ ముగ్గురిలో ఓ మహిళ రాహుల్ కు 6కోట్ల రూపాయలు ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసలు, ఈ మహిళ అంత పెద్దమొత్తంలో డబ్బు ఎందుకిచ్చింది? రాహుల్ మర్డర్ జరిగినప్పుడు ఈ ముగ్గురు మహిళలు స్పాట్ లోనే ఉన్నారా? అసలు, రాహుల్ మర్డర్ లో మహిళలు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

రాహుల్ తండ్రి కంప్లైంట్ మేరకు ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా కోరాడ విజయ్ కుమార్, ఏ2గా కోగంటి సత్యం ఉండగా…ఏ3గా కోరాడ విజయ్ భార్య పద్మజ, ఏ4గా గాయత్రి, ఏ5 పద్మజను చేర్చారు. అయితే, ఏ4, ఏ5 గాయత్రి, పద్మజ తల్లీకూతుళ్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రహ్యంగా విచారణ జరుపుతున్నారు. వ్యాపారి రాంప్రసాద్ మర్డర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్యామ్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, కోరాడ విజయ్ డ్రైవర్ బాబు ఇచ్చిన వాంగ్మూలమే కేసులో అత్యంత కీలకంగా మారిందనే మాట వినిపిస్తోంది. ఇంతకీ బాబు చెప్పిన ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి?

రాహుల్ మర్డర్ లో కోగంటి సత్యం పాత్రే కీలకంగా మారింది. అతని చుట్టే అనుమానాలు బలపడుతున్నాయ్. దాంతో, కోగంటి సత్యం పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కోరాడ విజయ్ వాటాను కొనేందుకు కోగంటి ముందుకు రావడంతోనే అసలు కథ మొదలైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కోగంటిని కంపెనీలోకి తీసుకునేందుకు రాహుల్ నిరాకరించడంతోనే ఈ మర్డర్ జరిగినట్లు భావిస్తున్నారు. రాహుల్ మర్డర్ కు మాస్టర్ ప్లాన్ వేసింది… దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది మొత్తం కోగంటి టీమ్ గా అనుమానిస్తున్నారు. మూడు నెలల క్రితమే స్కెచ్ వేసి దాన్ని ఈనెల 18న ఎగ్జిక్యూట్ చేసినట్లు గుర్తించారు.

మొత్తానికి, రాహుల్ స్థాపించిన జిక్సిన్ కంపెనీయే మర్డర్ కు మొయిన్ రీజన్ గా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాహుల్ జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకు కొట్టేసేందుకు బడా బాబులు చేసిన కుట్రలు ఫలించకపోవడంతోనే చివరికి మర్డర్ ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేసినట్లు తెలుస్తోంది. మరి, ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు బయటికి వస్తాయో చూడాలి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్