Vijayawada: అన్నకు రాఖీ కట్టిన కాసేపటికే అత్తింట్లో మరణం.. అసలేం జరిగింది..?
ఆదివారం రాఖీ పండుగ.. ఈ క్రమంలో ఓ యువతి అన్నకు ప్రేమతో రాఖీ కట్టింది. అతడి ఆశీర్వచనాలు తీసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అత్తింట్లో శవంగా...
ఆదివారం రాఖీ పండుగ.. ఈ క్రమంలో ఓ యువతి అన్నకు ప్రేమతో రాఖీ కట్టింది. అతడి ఆశీర్వచనాలు తీసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అత్తింట్లో శవంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ యువతి.. అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్లిన సోదరుడు.. తన చెల్లి చనిపోయిందన్న విషయం తెలిసుకుని షాక్‌కు గురయ్యాడు. తిరిగి వచ్చేసరికి.. ఆమె విగత జీవిగా మార్చురీ బాక్సులో కనిపించడంతో గుండెలవిసేలా రోధించాడు. అత్తింటివారే ఆమె మరణానికి కారకులని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసాదంపాడుకు చెందిన ఉష (23) రెండేళ్ల క్రితం అరండల్‌పేటకు చెందిన ఫణిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. భర్త మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుండగా, ఉష సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తోంది. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నావంటూ తన చెల్లిని అత్తింటివారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసేవారని ఉష సోదరుడు సూర్యనారాయణ ఆరోపిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో చెల్లెలి ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్లానని, తర్వాత రెండు గంటల్లోనే ఉష చనిపోయిందని ఫోన్ చేశారంటూ వాపోయాడు. ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయిన ఉషను హాస్పిటల్‌కు తీసుకువెళ్లామని, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని భర్త, ఇతర బంధువులు చెబుతున్నారు. యువతి తండ్రి సత్యనారాయణ కంప్లైంట్ మేరకు సూర్యారావుపేట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సౌత్ ఏసీపీ ఎన్.వెంకటేశ్వర్లు, సీఐ సూర్యనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
కొద్ది రోజుల్లో వివాహం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తూ వరుడు మృతి!
వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు బైక్‌పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న.. బైక్ ఢీకొని ఓ యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లి వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన మహేశ్ (26) మృతి చెందాడు. మహేశ్‌కు ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మహేశ్ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: ఆ ప్రాంతాలలో సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు అమ్ముతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక