Lactose Intolerant: పాలు అంటేనే ఆమడదూరం పరిగెడతారా? మరి కాల్షియం ఎలా? ఇవి ట్రై చెయ్యండి

పాలు మాములు బలం కాదు. అందుకే చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలకు డైలీ గ్లాసు పాలు తాగడం అలవాడు చేస్తారు. అందులో ఉండే పోషకాలు అలాంటివి..

Lactose Intolerant: పాలు అంటేనే ఆమడదూరం పరిగెడతారా? మరి కాల్షియం ఎలా? ఇవి ట్రై చెయ్యండి
Calcium Foods
Follow us

|

Updated on: Aug 23, 2021 | 8:39 AM

పాలు మాములు బలం కాదు. అందుకే చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలకు డైలీ గ్లాసు పాలు తాగడం అలవాడు చేస్తారు. అందులో ఉండే పోషకాలు అలాంటివి మరి. ఇక పాలతో తయారయ్యే డైరీ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. అయితే ల్యాక్టోజ్‌ పడనివారు ఈ పాల ఉత్పత్తులు అంటే ఆమడదూరం పరిగెడతారు. కానీ తీసుకునే ఆహారంలో కాల్షియం లోపిస్తే చాలా ప్రమాదాలు వెంటాడతాయి. ముఖ్యంగా ఆర్ధరైటిస్‌ వచ్చే ప్రమాదం అధికం. అందుకే పాలు, పాల ఉత్పత్తులు పడని వారు కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహార పదార్ధాలను డైట్‌లో భాగం చేసుకోవాలి.

తెల్లనువ్వులు లేదా నల్ల నువ్వులు ఈ రెండింటిలో లెక్కకు మించిన పోషకాలు ఉంటాయి.  వీటిలో క్యాల్షియం కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. రోజుకి టీస్పూను నువ్వులు డైట్‌లో చేర్చుకుంటే చాలు సేఫై పోవొచ్చు. ఇక అవిసె గింజలు మన బాడీకి బాగా ఉపయోగపడాతాయి. వీటిలో ఒమేగా–3 ప్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, పీచుపదార్థంతో పాటు క్యాల్షియం ఎక్కువ స్థాయిల్లో ఉంటుంది. డైలీ టీస్పూను అవిసె గింజల్ని సలాడ్‌పై చల్లుకుని తింటే బాడీకి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. ఇక గసగసాల్లో కూడా క్యాల్షియం బాగానే ఉంటుందండోయ్. క్యాల్షియం మాత్రమే కాదు మ్యాంగనీస్, ప్రొటీన్, పీచుపదార్థం కూడా ఉంటుంది. సో.. గసగసాలు మనం తినే ఫుడ్‌లో ఉండేలా చూసుకుంటే బెటర్. ఇక ఆకుకూరలు గురించి చెప్పేది ఏముంది. అయితే ఇక్కడ ముఖ్యంగా పురుగు మందులు వాడని.. ఆర్గానిక్ ఆకుకూరలు ప్రిఫర్ చెయ్యండి. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు దొరుకుతాయి.  ముఖ్యంగా మెంతికూర, మునగాకుల్లో క్యాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని కూరలుగా లేదా ఎండబెట్టి తీసుకుంటే క్యాల్షియంతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజపోషకాలు శరీరానికి అందుతాయి. శరీరం సాధారణ పనితీరుకు కాల్షియం చాలా అవసరం. కాబట్టి అశ్రద్ద చేయకుండా పాలు, పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఇష్టం లేకపోతే.. పైన అందించిన సమాచారంలో ఉన్న పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోండి.

(గమనిక: ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది)

Also Read:  అతివలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో

 విద్యార్థినులు, మహిళలు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని హీరో అడవి శేష్ పిలుపు