AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue: విశాఖ, చిత్తూరు జిల్లా సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభణ, గ్రామాలకు గ్రామాలే మంచాన పడుతోన్న వైనం

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో డెంగ్యూ వ్యాధి విపరీతంగా ప్రబలుతోంది. విశాఖ మన్యంతోపాటు చిత్తూరు జిల్లాలోనూ డెంగ్యూ భయపెడుతోంది.

Dengue: విశాఖ, చిత్తూరు జిల్లా సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభణ, గ్రామాలకు గ్రామాలే మంచాన పడుతోన్న వైనం
Venkata Narayana
|

Updated on: Aug 22, 2021 | 4:42 PM

Share

Dengue Fever: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో డెంగ్యూ వ్యాధి విపరీతంగా ప్రబలుతోంది. విశాఖ మన్యంతోపాటు చిత్తూరు జిల్లాలోనూ డెంగ్యూ భయపెడుతోంది. చిత్తూరు జిల్లాలో మహమ్మారి ధాటికి గ్రామాలకు గ్రామాలే మంచాన పడుతున్నాయి. తిరుపతి రుయా ఆస్పత్రి డెంగ్యూ రోగులతో నిండిపోతోంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు… కడప, అనంతపురం జిల్లాలోనూ విష జ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అయితే, డెంగ్యూ ఫీవర్స్ కు పారిశుద్ధ్య నిర్వహణా లోపమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.

అటు, విశాఖ మన్యాన్ని డెంగ్యూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏజెన్సీలో డెంగ్యూ రోగులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. 11 మండలాల్లో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క విశాఖ నగరంలోనే 30కి పైగా డెంగ్యూ కేసులు నమోదు కావడంతో తీవ్రతకు అద్దంపడుతోంది. ఎక్కువమంది ఫీవర్, బ్లడ్ బీడింగ్, బాడీ పెయిన్స్, ప్లేట్ లెట్స్ డౌన్ తో ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

అయితే, కోవిడ్ జ్వరమా? లేక డెంగ్యూ ఫీవరా? అనేది తెలియకపోవడంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. కరోనా, డెంగ్యూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉండటంతో రోగులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. స్థానిక బీజేపీ నేత లోకుల గాంధీ ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. డెంగ్యూతో పలువురు మృత్యువాత పడుతుండటంతో అడవి బిడ్డల్లో ఆందోళన మొదలైంది. డెంగ్యూ రోగుల కోసం విశాఖ కేజీహెచ్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

Read also: Powerful Women: పద్మజ.! బ్యాంకింగ్‌నేకాదు, ప్రభుత్వ శాఖలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బిజినెస్‌ స్కూల్స్‌ అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన దీశాలి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?