AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Tumor: తలనొప్పి ఎక్కువ రావడం బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతమా? ఇది క్యాన్సర్‌గా మారుతుందా? తెలుసుకోండి!

బ్రెయిన్ ట్యూమర్ మనిషిని చాలా ఇబ్బంది పెట్టే ఆరొగ్య సమస్య. అయితే, బ్రెయిన్ ట్యూమర్లు మెదడుకు మాత్రమే పరిమితం అని చాలా మంది నమ్ముతారు.

Brain Tumor: తలనొప్పి ఎక్కువ రావడం బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతమా? ఇది క్యాన్సర్‌గా మారుతుందా? తెలుసుకోండి!
Brain Tumor
KVD Varma
|

Updated on: Aug 23, 2021 | 9:30 AM

Share

Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ మనిషిని చాలా ఇబ్బంది పెట్టే ఆరొగ్య సమస్య. అయితే, బ్రెయిన్ ట్యూమర్లు మెదడుకు మాత్రమే పరిమితం అని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఈ కణితి క్యాన్సర్‌గా మారితే.. అది మూత్రపిండాలు, ప్రేగులు.. ఊపిరితిత్తులను కూడా చేరుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ ట్యూమర్‌లో, లక్షణాలు కూడా రోగులలో భిన్నంగా కనిపిస్తాయి. వీటి నివారణకు అత్యంత ముఖ్యమైన విషయం దాని ప్రారంభ లక్షణాలను సకాలంలో గుర్తించడం. దీన్ని అర్థం చేసుకుంటే, ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్‌కు సంబంధించిన భ్రమలు వాటి వెనుక ఉన్న నిజాలను గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 

అపోహ: అన్ని రకాల మెదడు కణితులు క్యాన్సర్‌కు కారణమవుతాయి.

నిజం: మెదడు కణితుల్లో మూడింట ఒకవంతు మాత్రమే క్యాన్సర్‌గా మారుతుందని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ హెడ్ న్యూరోసర్జన్ డాక్టర్ అభయ్ కుమార్ చెప్పారు. చాలా మెదడు కణితులు క్యాన్సర్ లేనివి. అనగా అవి క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగించవు. చికిత్స చేయడం ద్వారా వాటిని పూర్తిగా నిర్మూలించవచ్చు.

అపోహ: బ్రెయిన్ ట్యూమర్ మెదడుకు మాత్రమే పరిమితం.

వాస్తవం: ఇది మెదడులో మొదలవుతుంది కానీ అది క్యాన్సర్‌గా మారినప్పుడు.. అది శరీరంలోని అనేక భాగాలకు చేరుతుంది. ఉదాహరణకు, ఇది మూత్రపిండాలు, రొమ్ము, ఊపిరితిత్తులు.. ప్రేగులను చేరుకోవచ్చు. అందువల్ల, బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసిన   వెంటనే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. 

అపోహ: కుటుంబ సభ్యులలో బ్రెయిన్ ట్యూమర్స్ వంశపారంపర్యంగా వస్తాయి..

నిజం: డాక్టర్ అభయ్ ప్రకారం.. ఇది కుటుంబ సభ్యులలో వంశపారంపర్యంగా వస్తుంది అనడానికి  ఇప్పటి వరకు ఆధారాలు లేవు. ఇది ఏ వయసులోనైనా ఎవరికైనా రావచ్చు. నవజాత శిశువులలో మెదడు కణితుల కేసులు కూడా కనుగొనబడ్డాయి.

అపోహ: మొబైల్ ఫోన్‌లు మెదడు కణితులకు కారణమవుతాయి.

నిజం: మొబైల్ ఫోన్ లేదా రేడియేషన్ బ్రెయిన్ ట్యూమర్‌లకు కారణమవుతుందని నిరూపించే అటువంటి పరిశోధన ఇప్పటి వరకు బయటకు రాలేదు. కాకపోతే, రేడియేషన్‌కు ఎక్కువసేపు గురికావడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అపోహ: బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ప్రతి రోగికి ఒకే లక్షణాలు కనిపిస్తాయి.

నిజం: ఇది పూర్తిగా నిజం కాదు. మెదడు కణితి పరిమాణం.. స్థానాన్ని బట్టి, వివిధ రోగులలో లక్షణాలు కూడా భిన్నంగా కనిపిస్తాయి. కొంతమంది రోగులు దాని లక్షణాలను కూడా చూపించరు. అదే సమయంలో, కొన్నింటిలో పరిస్థితి చాలా ఘోరంగా మారుతుంది. దానికి  చికిత్స చేయడం కష్టమవుతుంది.

గందరగోళం: నిరంతర తలనొప్పి..అస్పష్టమైన దృష్టి మెదడు కణితికి సంకేతాలు.

వాస్తవం: ఇది ప్రతి రోగిలో మెదడు కణితికి సంకేతం కాదు. తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు, దీనిని బ్రెయిన్ ట్యూమర్ లక్షణంగా మాత్రమే పరిగణించడం సరికాదు. మీకు లక్షణాలు అనిపిస్తే పరీక్షించుకోండి.

Lactose Intolerant: పాలు అంటేనే ఆమడదూరం పరిగెడతారా? మరి కాల్షియం ఎలా? ఇవి ట్రై చెయ్యండి

Mouth Health: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..కానీ నోరు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుందని నిపుణులు అంటున్నారు!