Gold Price Today: అతివలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో
Gold price 23 August 2021: గోల్డ్ రేటు తగ్గింది. ఓ మోస్తారుగా దిగి వచ్చింది. బంగారం కొనాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక గోల్డ్ రూట్‌లోనే సిల్వర్...
గోల్డ్ రేటు తగ్గింది. ఓ మోస్తారుగా దిగి వచ్చింది. బంగారం కొనాలనుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక గోల్డ్ రూట్‌లోనే సిల్వర్ కూడా ప్రయాణించింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బంగారం రేట్లు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ నడిచిందని నిపుణులు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం ( ఆగస్టు 23) బంగారం ధర డౌన్ అయ్యింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.48,160కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే రూట్‌లో పయనించింది. రూ.110 తగ్గుదలతో రూ.44,140కు దిగివచ్చింది. గోల్డ్‌తో పాటే వెండి రేటు కూడా తగ్గింది. వెండి రేటు రూ.340 డౌన్ అయ్యింది. దీంతో కేజీ వెండి ధర రూ.66,660కు తగ్గింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభ వార్త అని చెప్పొచ్చు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.29 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1778 డాలర్లకు డౌన్ అయ్యింది. వెండి రేటు కూడా పడిపోయింది. ఔన్స్‌కు 0.41 శాతం తగ్గుదలతో 23.02 డాలర్లకు పడిపోయింది.
ఏపీలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా…
విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,140
విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,140
కాగా గోల్డ్ రేటును ఎఫెక్ట్ చేసే అంశాలు చాలా ఉంటాయి. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి ఇంట్రస్ట్ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు గోల్డ్ ధర ప్రభావం చూపుతాయి. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా… నగల షాపుల్లో మాత్రం తరుగు, మజూరీ అంటూ… రకరకాలుగా ఛార్జీలు అధికంగా వేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక వినాయక చవితి కూడా త్వరలో రాబోతోంది కాబట్టి… బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: విద్యార్థినులు, మహిళలు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని హీరో అడవి శేష్ పిలుపు
మాస్క్ తీస్తే ఒక భయం.. పెట్టుకుంటే మరొక భయం.!.. డెంటిస్టుల వద్దకు బాధితుల క్యూ