Mask Mouth: మాస్క్ తీస్తే ఒక భయం.. పెట్టుకుంటే మరొక భయం.!.. డెంటిస్టుల వద్దకు బాధితుల క్యూ

ఉన్నట్టుండి నోరు డ్రైగా మారుతోంది. బ్యాడ్ స్మెల్ వస్తోంది. టీత్‌లో కావిటీస్ పెరిగిపోతున్నాయి. గమ్స్ సమస్యలు వేధిస్తున్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్...

Mask Mouth: మాస్క్ తీస్తే ఒక భయం.. పెట్టుకుంటే మరొక భయం.!.. డెంటిస్టుల వద్దకు బాధితుల క్యూ
Mask Mouth
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 22, 2021 | 1:18 PM

ఉన్నట్టుండి నోరు డ్రైగా మారుతోంది. బ్యాడ్ స్మెల్ వస్తోంది. టీత్‌లో కావిటీస్ పెరిగిపోతున్నాయి. గమ్స్ సమస్యలు వేధిస్తున్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మధ్య ఇలాంటి సమస్యలతోనే జనం డెంటిస్టుల దగ్గరికి పరుగెడుతున్నారు. దీనికి కారణం ఏంటే తెలుసా కరోనాయే. ప్రత్యక్షంగానే కాదు..పరోక్షంగానూ మన జీవితాలతో ఫుట్‌బాల్‌ ఆడుతోంది ఈ రాకాసి వైరస్.

ఇప్పటికే రెండు వేవ్‌లు ముగిశాయి. ఆ బీభత్సం ఎలా ఉంటుందో కళ్లారా చూశాం. ఇప్పుడు థర్డ్‌వేవ్ భయంతో బిక్కుబిక్కుమంటున్నాం. అందుకే భయంతో ఒకటికి రెండు మాస్క్‌లు బిగించి కుడుతున్నాం. గంటలకొద్ది మాస్క్‌ను తీయకుండా అలాగే ఉంచుకుంటున్నాం. ఇదిగో ఇక్కడే వస్తోంది అసలు సమస్య. మాస్క్‌మౌత్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.. మాస్క్‌ మౌత్ అంటే మాస్కు పెట్టుకోవడం వల్ల వచ్చే నోటి, దంత సమస్యలు. మాస్క్‌లు ఎక్కువ సేపు పెట్టుకోవడం వల్ల నోట్ల సరిపడా లాలాజలం ఊరడం లేదు. మనకు తెలియకుండానో ముక్కుతో పీల్చుకోవాల్సిన శ్వాసను నోటితో తీసుకుంటున్నాం. దీంతో నోట్లోని సెలైవా మొత్తం డీహైడ్రేట్‌ అయిపోతోంది. ఫలితంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సాధరణంగా సెలైవా PH లెవల్ 7.4గా ఉంటుంది. కానీ ప్రొడక్షన్ తగ్గితే యసిడిక్‌గా మారుతుంది. అప్పుడు బ్రాడ్ బ్రీత్ ప్రొడక్ట్‌ చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో నోటిలోంచి దర్వాసన రావడం, మౌత్..గమ్స్ డ్రైగా మారిపోవడం.. కావిటీస్‌ ఏర్పడటం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. లాంగ్‌రన్‌లో గొంతు నొప్పి, చిగుళ్లవాపు, బ్లీడింగ్‌ సమస్యలకు కారణమవుతోంది.

సాధారణంగా ప్రతి వ్యక్తి నోట్లో రోజూ లీటరు లాలాజలం ఉత్పత్తవుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. నోటిని క్లీన్ చేయడానికి, పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని శుభ్రం చేయడానికి ఇది యూజ్ అవుతుంది. తిన్న ఆహరం అరగడానికి ఉపయోగపడే అమైలేజ్‌ ఎంజైమ్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. కడుపులో గ్యాస్‌ను కూడా నియంత్రిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న సెలైవా చాలా మందిలో పూర్తిస్థాయిలో ప్రొడ్యూస్ కావడంలేదు. దానికి కారణం విరామం లేకుండా మాస్కు వాడడమే అంటున్నారు వైద్యులు.

ప్రస్తుత జనాభాలో 90 శాతం మంది ఏదో ఒక పంటి సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. 45 నుంచి 48 శాతం మందిని పిప్పి పళ్ల సమస్య వేధిస్తుండగా.. 75 శాతం మంది చిగుళ్లవాపుతో ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ కరోనా రక్షణ నుంచి వాడే మాస్క్ కూడా ప్రమాదకారిగా మారింది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ ప్రమాదం నుంచి కాస్త బయటపడే ఛాన్స్ ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్95 మాస్కులతో పాటు క్లాత్ మాస్క్ ఉపయోగిస్తే చాలని వైద్యులు సూచిస్తున్నారు. వాడిన మాస్కులు ఎట్టి పరిస్థితుల్లో శుభ్రపరచకుండా తిరిగి పెట్టుకోవద్దంటున్నారు. చుట్టూ ఎవరూ లేకుంటే కొద్దిసేపు మాస్కు తీసేయొచ్చని సూచిస్తున్నారు. నోరు ఆరిపోతుంటే మంచినీళ్లు తాగాలని, రోజుకు రెండుసార్లు ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలని చెబుతున్నారు.

మహమ్మారి సెకండ్ వేవ్ తో హడలెత్తిన జనం ఇటీవల రెండేసి మాస్కులు పెట్టుకుంటున్నారు. ఇది గాలిని సరిగా పీల్చలేని పరిస్థితికి దారితీస్తుంది. కొందరు ఎన్‌95 మాస్కు వాడుతూనే దాని కింద త్రీ లేయర్ ఉన్న మరో మాస్కును వాడుతున్నారు. దీంతో బయట గాలి అంతగా లోపలికి చొరబడదు. అడపాదడపా నోటి ద్వారానూ శ్వాస తీసుకుంటున్నారు. దీంతో నోరు ఎండిపోతోంది. అప్పటికే కొద్దిగా పుచ్చిన పళ్లపై ఇవి ప్రభావం చూపుతున్నాయి. చిగుళ్లు ఉబ్బడం, రక్తం కారడంతోపాటు నోట్లో దుర్వాసన ప్రారంభమవుతోంది. ఆ తర్వాత పళ్లు కదిలిపోతుండటమే కాకుండా వాటి కింద ఎముకలూ దెబ్బతింటున్నాయి. షుగర్ పేషెంట్లలో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. చాలా వరకు షుగర్‌ పేషెంట్ల దంతాలు దెబ్బతింటున్నాయని వైద్యుల పరిశీలనలో తేలింది.

Also Read:Ever Given: అతి పెద్ద వాణిజ్య నౌక ‘ఎవర్‌ గీవెన్‌’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్

 పారాలింపిక్స్‌ కోసం భారత్‌ టీమ్ రెడీ..15 మెడల్స్ గ్యారంటీ అంటున్న కమిటీ