Ever Given: అతి పెద్ద వాణిజ్య నౌక ‘ఎవర్‌ గీవెన్‌’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్

ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్‌ గీవెన్‌ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2 లక్షల 20 వేల టన్నుల సరుకు...

Ever Given: అతి పెద్ద వాణిజ్య నౌక 'ఎవర్‌ గీవెన్‌' గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్
Ever Given
Follow us

|

Updated on: Aug 22, 2021 | 12:41 PM

ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్‌ గీవెన్‌ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2 లక్షల 20 వేల టన్నుల సరుకు తరలించే వీలుంటుంది. ఇంత భారీ నౌక మధ్యధర సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తూ మార్చి 23న కాలువలో కూరుకుపోయింది. పెనుగాలుల తీవ్రంగా కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. కూరుకుపోయిన నౌకను బయటకు తీసేందుకు ఆరు రోజుల సమయం పట్టింది. దీంతో ఆ ఆరు రోజుల పాటు కాలువ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయి బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. సూయజ్‌ కాలువ నుంచి బయటకు తీసిన తర్వాత ఎవర్‌గీవెన్‌ నౌకను సూయజ్‌ కెనాల్‌ అథారిటీ సీజ్‌ చేసింది. ఆరు రోజుల పాటు కెనాల్‌ బ్లాక్‌ అయినందుకు గాను 916 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో ఇటు సూయజ్‌ కెనాల్‌ అథారిటీ, ఎవర్‌గీవెన్‌ నౌక యాజమాన్యం షోయ్‌ కిసెన్‌ ఖైషా, ఇన్సురెన్స్‌ సంస్థల మధ్య చర్చలు జరిగాయి. మూడు నెలల చర్చల అనంతరం 600 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఎవర్‌గీవెన్‌ నౌకను జులై 7న రిలీజ్‌ చేశారు.

సూయజ్‌ కెనాల్‌ నుంచి రిలీజైన తర్వాత మరమ్మత్తులు నిర్వహించి జులై 29న హలండ్‌లోని రోటర్‌డ్యామ్‌కు చేరుకుంది. అనంతరం ఇంగ్లండ్‌ ఫెలిక్స్‌టోవ్‌ పోర్టుకు చేరింది. అక్కడ మరోసారి సరుకులు నింపుకుని వాణిజ్య ప్రయాణానికి రెడీ అయ్యింది. ఇంగ్లండ్‌ నుంచి చైనాకు ప్రయాణమైన ఎవర్‌ గీవెన్‌ ఆగస్టు 20న మరోసారి సూయజ్‌ కాలువ దాటింది. మరోసారి ప్రమాదం జరగకుండా సూయజ్‌ కెనాల్‌ అథారిటీ జాగ్రత్తలు తీసుకుని.. ఎవర్‌గీవెన్‌కు తోడుగా రెండు టగ్‌ బోట్లను కూడా పంపింది. ఎవర్‌గీవెన్‌తో పాటు ఒకేసారి 26 చిన్న నౌకలు సైతం సూయజ్‌ను దాటినట్లు ఈజిప్టు మీడియా ప్రకటించింది.

Also Read:Coronavirus: విజృంభిస్తోన్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌.. వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ అటాక్..

చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపిన ఆనంద్ మహీంద్రా.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు..

Latest Articles