Viral Photo: చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపిన ఆనంద్ మహీంద్రా.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు..

Viral Video: ఒకప్పుడు మన రోజువారీ జీవితంలో స్టీల్‌ టిఫిన్‌ బాక్స్‌ భాగమయ్యేది. స్కూల్‌, కాలేజ్, జాబ్‌లకు వెళ్లే వారు స్టీల్‌ టిఫిన్‌ డబ్బా తీసుకెళ్ళేవారు.

Viral Photo: చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపిన ఆనంద్ మహీంద్రా.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు..
Tiffin Box
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 22, 2021 | 12:28 PM

Viral Video: ఒకప్పుడు మన రోజువారీ జీవితంలో స్టీల్‌ టిఫిన్‌ బాక్స్‌ భాగమయ్యేది. స్కూల్‌, కాలేజ్, జాబ్‌లకు వెళ్లే వారు స్టీల్‌ టిఫిన్‌ డబ్బా తీసుకెళ్ళేవారు. తర్వాత ప్లాస్టిక్‌దే హవాగా మారిపోయింది. తాజాగా ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేసిన ఓ స్టీల్‌ బాక్స్‌ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు.. చిన్ననాటి జ్ఞపకాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు.

ఒకప్పుడు మన రోజువారీ జీవితంలో స్టీల్‌ టిఫిన్‌ బాక్స్‌కి ఉన్న విలువ వెలకట్టలేనిది. స్కూల్‌, కాలేజ్‌ లేదా జాబ్‌లకు వెళ్లే వారు టిఫిన్‌ డబ్బా తీసుకెళ్లడం అందరికి తెలిసిందే. ఇటీవల ప్లాస్టిక్‌ డబ్బాలకు అలవాటు పడ్డా.. ప్లాస్టిక్‌తో అనారోగ్య సమస్యలు ఉంటాయని తెలిసి మళ్లీ స్టీల్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఓ మహిళ తన చేతిలో స్టీల్ టిఫిన్ బాక్స్‌ను తీసుకెళ్తున్న ఫోటోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఒక మహిళ స్టీల్ టిఫిన్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర.. “న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బా వాలీ” అనే క్యాప్షన్‌ ఇచ్చారు. న్యూయార్క్‌లో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్తూ స్టీల్ డబ్బాను తీసుకెళ్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ముంబైలో పేరుమోసిన ‘డబ్బావాలా’ సేవలను గుర్తుచేసేలా డబ్బావాలి అని కామెంట్‌ పెట్టడంతో ఆ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టీల్ టిఫిన్ బాక్స్‌లతో అనుబంధం ఉన్న భారతీయులు ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు.

న్యూయార్క్‌లో ఒక మహిళ స్టీల్ డబ్బాను ఇలా తీసుకెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ. ‘స్టీల్ డబ్బా.. చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపింది’ అని భావేద్వాగానికి లోనవుతున్నారు. మరొకరు స్టీల్ డబ్బానే ఓ “భావోద్వేగం” అని కామెంట్‌ చేశారు. మొత్తానికి ఆనంద్ మహీంద్ర చిన్ననాటి జ్ఞాపకాలను తట్టి లేపారని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

Anand Mahindra Tweet:

Also read:

Food for good memory: మీ చిన్నారుల్లో జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచాల‌నుకుంటున్నారా..? అయితే ఈ రోజు నుంచే వారికి ఇవి తినిపించండి.

Online Marriage: వాళ్లక్కడ.. వీళ్లిక్కడ.. ఆన్‌లైన్‌ పెళ్లి సందడి! వేడుక ఎలా జరిగిందో చూడండి.

TV Shows: టీవీల్లో పిల్లల కోసం వచ్చే షోలకు పెరిగిన ఆదరణ..సక్సెస్ బాటలో భారతీయ కార్టూన్ షోలు!

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్