India Corona Cases: భారత్ కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 24 గంటల్లో 403 మృతి..

India Corona Cases: భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రోజు వారీగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏమాత్రం ..

India Corona Cases: భారత్ కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 24 గంటల్లో 403 మృతి..
Corona Third Wave
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 22, 2021 | 10:28 AM

India Corona Cases: భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రోజు వారీగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 30,948 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ ప్రభావంతో ఒక్క రోజులో 403 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో 38,487 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. భారతదేశంలో ఇప్పటి వరకు 3,24,24,234 మందికి కరోనా సోకగా.. వీరిలో 3,16,36,469 మంది కోలుకున్నారు. ఇక వైరస్ మహమ్మారి కారణంగా 4,34,367 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 3,53,398 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలామంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇక కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో మహారాష్ట్ర నిలిచింది. ఆ తరువాత జాబితాలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, రాజస్థాన్ గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, బిహార్, తెలంగాణ, పంజాబ్, అస్సాం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఇదిలాఉంటే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 52,23,612 డోస్‌లు వేయగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 58,14,89,377 వ్యాక్సీన్ డోస్‌లు వేశారు.

Also read:

Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. గుంటూరులో ఆగస్టు 25న జాబ్‌మేళా.. పాల్గొననున్న 6 కంపెనీలు. పూర్తి వివరాలు..

Rakshabandhan 2021: ప్రేమతో రాఖీ కట్టిన మీ సోదరికి ఈ కానుక ఇవ్వండి..గ్యారెంటీగా ఇది ఆమె సంతోషాన్ని పదింతలు చేస్తుంది!

Megastar Chiranjeevi Birthday: ఆయనకు తమ్ముడిగా పుట్టడం అదృష్టం.. పవర్ స్టార్ భావోద్వేగ శుభాకాంక్షలు..