AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: తమిళనాడులో 1 నుంచి మళ్ళీ స్కూళ్ళు.. రేపటి నుంచి సినీ థియేటర్లకు అనుమతి

తమిళనాడులో వచ్చే నెల 1 నుంచి మళ్ళీ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. 9 నుంచి 12 తరగతుల పిల్లలు తిరిగి బడిబాట పట్టవచ్చు..

Tamilnadu: తమిళనాడులో 1 నుంచి మళ్ళీ స్కూళ్ళు.. రేపటి నుంచి సినీ థియేటర్లకు అనుమతి
Tamilnadu Schools Open
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Aug 22, 2021 | 1:39 PM

Share

తమిళనాడులో వచ్చే నెల 1 నుంచి మళ్ళీ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. 9 నుంచి 12 తరగతుల పిల్లలు తిరిగి బడిబాట పట్టవచ్చు.. కానీ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది అంతా విధిగా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించవలసి ఉంటుంది. నాన్-మీల్ స్కీం కింద స్కూలు యాజమాన్యాలు విద్యార్థులకు ఫుడ్ అందించవచ్చు.. అయితే 1 నుంచి 8 తరగతుల పిల్లలకు ఆఫ్ క్లాసెస్ నిర్వహణపై సెప్టెంబరు 15 తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. కాగా రేపటి నుంచి 50 శాతం కెపాసిటీతో సినీ థియేటర్లను అనుమతించనున్నారు. థియేటర్ల సిబ్బంది.. విధిగా వ్యాక్సినేషన్ తీసుకున్నవారై ఉండాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏమైనా ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ఆంక్షలను వచ్చేనెల 9 వరకు పొడిగించారు. సెప్టెంబరు 1 నుంచి కాలేజీలు, పాలిటెక్నిక్ విద్యాసంస్థలు మళ్ళీ తెరచుకోనున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న స్టాఫ్ తో బార్లు, హోటళ్లు, క్లబ్బులు, బీచ్ లకు కూడా అనుమతి లభించింది. ఆఫీసులు, ఐటీ కార్యాలయాలు వంద శాతం స్టాఫ్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.

షాపులను రాత్రి 10 గంటలవరకు తెరచి ఉంచడానికి అనుమతించారు. ఇప్పటివరకు ఇవి రాత్రి 9 గంటలవరకే పని చేసేవి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులను నిర్వహించడానికి కూడా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలో రోజుకు 2 వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత 24 గంటల్లో 1652 కొత్త కేసులు నమోదు కాగా 23 మంది రోగులు మృతి చెందారు. మరోవైపు పొరుగునున్న కేరళలో ఓనం ఫెస్టివల్ సంరంభ ప్రభావం తమిళనాడులో కూడా పడింది. ఇక్కడ కేరళీయులు దీన్ని ఉత్సాహంగా జరుపుకొంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Mouth Health: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..కానీ నోరు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం మంచిగా ఉంటుందని నిపుణులు అంటున్నారు!

Hyderabad: చార్మినార్‌లో దారుణం.. స్నేహితులే కదా 40 లక్షలు ఇచ్చాడు.. ఆపై ప్రాణాలు పోగొట్టుకున్నాడు..