Hyderabad: చార్మినార్‌లో దారుణం.. స్నేహితులే కదా 40 లక్షలు ఇచ్చాడు.. ఆపై ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
Hyderabad: ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సొంత స్నేహితులే కదా అని సాయం చేస్తే..
Hyderabad: ప్రస్తుత కాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి నెలకొంది. సొంత స్నేహితులే కదా అని సాయం చేస్తే.. ఆఖరికి ఆ వ్యక్తి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన భాగ్యనగరంలో చార్మినార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని కొందరు కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లి సంగారెడ్డిలో దారుణంగా హత్య చేశారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా పంట పొలాల్లోనే పాతిపెట్టారు. అయితే, మధుసూదన్ రెడ్డి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఆయన ఫోన్ కాల్ డేటా, ఇతర వివరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులకు మధుసూదన్ రెడ్డి స్నేహితులపై అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి స్నేహితుల్లో ఒకరైన జగన్నాథ్‌ను పట్టుకున్నారు పోలీసులు. అతన్ని తమదైన స్టైల్లో విచారించగా.. అసలు మ్యాటర్ బయటపడింది. మధుసూదన్ రెడ్డిని తామే హత్య చేసినట్లు వెల్లడించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్ ఘాట్‌కు చెందిన మధుసూదన్ రెడ్డికి.. సంజీవ్, గిరీష్, జగన్నాథ్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వీరు మధుసూదన్ వద్ద 40 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. అయితే, తీనుసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే.. అతనితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఈనెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డిని చార్మినార్‌లో ఉండే సంజీవ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ మధుసూదన్ రెడ్డికి, సంజీవ్, గిరీష్, జగన్నాథ్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిని అంతమొందించాలని ముగ్గురూ ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం అతన్ని కిడ్నాప్ చేశారు. చార్మినార్ నుంచి సంగారెడ్డిలో గల ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతన్ని చంపేసి వ్యవసాయ పొలాల్లో పాతిపెట్టారు. అయితే, తాజాగా జగన్నాథ్ ఇచ్చిన సమాచారం మేరకు.. మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి పోలీసులు వెళ్లారు. అక్కడ మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. జగన్నాథ్‌ను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సంజీవ్, గిరీష్ కోసం గాలిస్తున్నారు.
Also read:
Mask Mouth: మాస్క్ తీస్తే ఒక భయం.. పెట్టుకుంటే మరొక భయం.!.. డెంటిస్టుల వద్దకు బాధితుల క్యూ
Tokyo Paralympics: పారాలింపిక్స్ కోసం భారత్ టీమ్ రెడీ..15 మెడల్స్ గ్యారంటీ అంటున్న కమిటీ