AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Murder Case: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు.. పోలీసుల అదుపులోకి డ్రైవర్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Rahul Murder Case: విజయవాడ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలింపును తీవ్రతరం చేశారు.

Rahul Murder Case: పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసు.. పోలీసుల అదుపులోకి డ్రైవర్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Rahul Murder Case
Shiva Prajapati
|

Updated on: Aug 22, 2021 | 10:30 AM

Share

Rahul Murder Case: విజయవాడ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నిందితుల కోసం గాలింపును తీవ్రతరం చేశారు. హత్య జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా.. నిందితుల ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. అయితే, హత్య కేసులో అనుమానితులుగా భావిస్తున్న కోరాడ విజయ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఇదే అంశంలో గత ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు.

రూ. 15 కోట్లు విలువ చేసే జిక్సిన్ కంపెనీ30 శాతం వాటాను వెనక్కి ఇవ్వాలన్ని కోరాడ విజయ్.. రాహుల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాడు. డబ్బుల కోసం రాహుల్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు విజయ్ వాటాను కొనేందుకు కోగంటి సత్యం ప్రయత్నించడు. అయితే, అతనికి కంపెనీలో షేర్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించాడు. దాంతో రాహుల్‌ను హత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితమే రాహుల్ హత్యకు భారీ స్కెచ్ వేశారు. రాహుల్ హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది కోగంటి టీమ్‌ గా పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడం ద్వారా హత్య వెనుక కోగంటి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Also read:

India Corona Cases: భారత్ కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 24 గంటల్లో 403 మృతి..

Megastar Chiranjeevi Birthday: ఆయనకు తమ్ముడిగా పుట్టడం అదృష్టం.. పవర్ స్టార్ భావోద్వేగ శుభాకాంక్షలు..

Chiranjeevi Birthday Special: ఆచార్య ఆగయా… గాడ్ ఫాదర్ బన్ గయా…! లైవ్ వీడియో