Megastar Chiranjeevi Birthday: ఆయనకు తమ్ముడిగా పుట్టడం అదృష్టం.. పవర్ స్టార్ భావోద్వేగ శుభాకాంక్షలు..

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే సంబరాలను ప్రారంభించారు.

Megastar Chiranjeevi Birthday: ఆయనకు తమ్ముడిగా పుట్టడం అదృష్టం.. పవర్ స్టార్  భావోద్వేగ శుభాకాంక్షలు..
Chiranjeevi Pawan
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 24, 2021 | 7:54 PM

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే సంబరాలను ప్రారంభించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే హీరో, జనసేన అధినేత మెగాస్టార్ తమ్ముడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈమేకరు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.. చిరంజీవి నాకే కాదు ఎందరికో మార్గదశి.. చిరంజీవి నాకే కాదు ఎందరికో స్పూర్తి ప్రదాత.. చిరంజీవి నాకే కాదు.. ఎందరికో ఆదర్శప్రాయుడు.. ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ.. ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలనిచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించిన అదే విధేయత, అదే వినమ్రత శ్రీ చిరంజీవి గారి సొంతం. అందువల్లనేమో ఆయనను సొంత మనిషిలా భావిస్తారు లక్షలాది మంది. విద్యార్థి దశలోనే సేవా భావాన్ని పెంపొందించుకున్న శ్రీ చిరంజీవి గారు నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి.. కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవా గుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా ఉన్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దానాలు, గుప్తదానాలు ఎన్నో చేశారు. చేస్తూనే ఉన్నారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారు. అందువల్లే సినీ కార్మికులు అందరూ శ్రీ చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు.

శ్రీ చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టిన మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ చిరంజీవి గారికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను .. ప్రేమతో పవన్ కళ్యాణ్..

ట్వీట్..

Also Read: Chiranjeevi: చిరంజీవి – మెహర్‌ రమేష్‌ సినిమా టైటిల్‌ వచ్చేసింది.. మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌.

MAA Elections 2021: నేడు మా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ..

Megastar Chiranjeevi: సంబరాలు మొదలెట్టిన అభిమానులు.. మెగాస్టార్‏కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు..