కాబూల్ విమానాశ్రయం నుంచి 107 మంది భారతీయుల తరలింపు..ఢిల్లీ చేరిన ఇండిగో, ఎయిరిండియా విమానాలు
కాబూల్ నుంచి యుద్ధ ప్రాతిపదికన భారతీయుల తరలింపు ప్రారంభమైంది. 107 మంది భారతీయులతో సహా మొత్తం 168 మంది ప్రయాణికులత్తో కూడిన ఇండిగో, ఎయిరిండియా విమానాలు ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
కాబూల్ నుంచి యుద్ధ ప్రాతిపదికన భారతీయుల తరలింపు ప్రారంభమైంది. 107 మంది భారతీయులతో సహా మొత్తం 168 మంది ప్రయాణికులత్తో కూడిన ఇండిగో, ఎయిరిండియా విమానాలు ఆదివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. తజికిస్తాన్ రాజధాని దుషన్ బే, ఖతార్ విమానాశ్రయాల ద్వారా ఇవి ఢిల్లీ చేరాయి. వీరి తరలింపు దృశ్యాలను విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విటర్ లో షేర్ చేశారు. ఆఫ్ఘన్ లోని వివిధ నగరాల్లో ఇంకా సుమారు వెయ్యి మంది భారతీయులు ఉన్నట్టు అంచనా.. వారిని కూడా తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి రోజుకు రెండు భారతీయ విమాన సర్వీసులకు అమెరికా, నేటో దళాలు అనుమతించాయి. దీంతో ఇక ఈ యత్నాలు మరింత జోరందుకోనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం చేరేముందు భారతీయులు..భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తున్న చిన్న వీడియో క్లిప్ ను కూడా అరిందమ్ బాగ్చి తన ట్విటర్ లో జోడించారు.
కాగా ఢిల్లీ చేరిన వెంటనే వీరంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలుత కాబూల్ విమానాశ్రయం లోకి వీరిని అనుమతించేముందు.. అక్కడికి దగ్గరలోని పోలీసు స్టేషన్ లో అధికారులు వీరి ట్రావెల్ డాక్యుమెంట్లను పరిశీలించారు. నిన్న సుమారు 150 మంది భారతీయులను తాలిబన్లు బందీలుగా చేసుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. అయితే వారి చెరలో ఉన్నట్టు చెప్పిన భారతీయులంతా క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Tamilnadu: తమిళనాడులో 1 నుంచి మళ్ళీ స్కూళ్ళు.. రేపటి నుంచి సినీ థియేటర్లకు అనుమతి