మమ్మల్ని రక్షించారు.. ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రికి ఆఫ్ఘన్ ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
తాలిబన్ల రాక్షస రాజ్యం నుంచి రక్షించి తమను క్షేమంగా ఇండియాకు చేర్చినందుకు ఆఫ్ఘన్ ప్రజాప్రతినిధులు పలువురు ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కి, భారత వైమానికదళానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాలిబన్ల రాక్షస రాజ్యం నుంచి రక్షించి తమను క్షేమంగా ఇండియాకు చేర్చినందుకు ఆఫ్ఘన్ ప్రజాప్రతినిధులు పలువురు ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కి, భారత వైమానికదళానికి కృతజ్ఞతలు తెలిపారు. వీరిలో ఆఫ్ఘన్ సెనెటర్ అనార్కలి కౌర్ హోనార్యార్, ఎంపీ నరేందర్ ఖల్సా తదితరులు ఉన్నారు. ఖల్సా..ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరగానే ఉద్వేగం పట్టలేక విలపించారు. గత 20 ఏళ్లుగా తాను సంపాదించిందంతా ఫినిష్ అయిపోయిందని, ఇక తనకేం మిగిలిందని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అనార్కలి కౌర్ ప్రత్యేకంగా ప్రధాని మోదీని, విదేశాంగ మంత్రిని, భారత వైమానిక దళాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆమె పదేపదే ధన్యవాదాలు తెలిపారు. ఆఫ్ఘన్ సిక్కులు సైతం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ..తమకిది పునర్జన్మ అని అభివర్ణించారు. వీరితో కూడిన సుమారు 70 మంది గత శుక్రవారం రాత్రే కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ.. తాలిబన్లు వీరిని అడ్డుకున్నారు. విమానం ఎక్కేందుకు అనుమతించలేదని తెలిసింది. అయితే సుమారు 24 గంటల తరువాత పరిస్థితి చక్కబడింది. ఇద్దరు నేపాలీయులతో సహా 87 మంది నిన్న ఢిల్లీ చేరుకున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు తన ఇంటిని దగ్ధం చేశారని.. ఇప్పుడేం చేయాలని బారత్ చేరిన ఓ ఆఫ్ఘన్ మహిళ వాపోయింది. బహుశా ఇండియాలో ఆమె బంధువులు ఉన్నట్టు తెలుస్తోంది.తమ కుటుంబం దాచుకున్నదంతా తాలిబన్లు దోచుకున్నారని ఆమె తెలిపింది. అటు-ఢిల్లీలోని హిండాన్ ఎయిర్ బేస్ వద్ద వీరందరికీ ఆర్ టీ -పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉచిత పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నారు. మెడికల్ బృందమొకటి 24 గంటలూ ఈ సేవలో నిమగ్నమై ఉంది. మరోవైపు కాబూల్ నుంచి తమ విమాన సర్వీసులను పాక్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే 2 వేలమందికి పైగా తమ దేశస్థులు సురక్షితంగా స్వదేశం చేరుకున్నారని పాక్ సమాచార శాఖ మంత్రి ఫాద్ చౌదరి తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Car Sales: జూలై నెలలో పెరిగిన కార్ల అమ్మకాలు..గత నాలుగు నెలల్లో టాప్ సెల్లర్ గా నిలిచిన కారు ఎదో తెలుసా?