15 సంస్థలపై ఫేక్ కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి ప్రధాని మోదీ ఆదేశం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఫైర్

15 సంస్థలపై తప్పుడు (ఫేక్) కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి, ఈడీకి ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.

15 సంస్థలపై ఫేక్ కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి ప్రధాని మోదీ ఆదేశం.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఫైర్
Manish Sisodia
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 22, 2021 | 1:51 PM

15 సంస్థలపై తప్పుడు (ఫేక్) కేసులు పెట్టాలని ఢిల్లీ పోలీసులకు, సీబీఐకి, ఈడీకి ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే లోగా ఫేక్ దాడులు నిర్వహించి తప్పుడు కేసులు బనాయించాలని అంటూ 15 సంస్థల జాబితాను కూడా ఆయన ఇచ్చారన్నారు. ఈ సంస్థల్లో ఆప్ పార్టీకి చెందినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో ఎన్నికలు జరిగేలోగానే ఈ సంస్థలను నాశనం చేయాలనీ ఆయన సూచించారని సిసోడియా చెప్పారు. మోదీ బ్రహ్మాస్త్రం రాకేష్ ఆస్తానా అని, తనకెవరు అడ్డొచ్చినా ఖాతరు చేయకుండా మీరు అప్పగించిన పనిని పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిసిందని సిసోడియా పేర్కొన్నారు. నిజాయితీ రాజకీయాలకు ఆప్ పెట్టింది పేరన్నారు. మీరు సీబీఐని, ఈడీని పంపినా తాము వాటిని ఆహ్వానిస్తాం..గతంలో ఈ సంస్థలు నా ఇంటిలోనూ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇల్లు, ఆఫీసుల్లోనూ ఇలాంటి దాడులు జరిగేలా చూశారు.. ఏం లభించింది అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు తన ఇంటి బెడ్ రూమ్ లో కూడా ప్రవేశించారన్నారు.

ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా.. సిసోడియా వ్యాఖ్యలను ఖండించారు. డీటీసీ బస్ స్కామ్ , ఎక్సయిజు పాలసీ నిధులు, ఢిల్లీ జలమండలి కుంభకోణాల్లో మీ ప్రభుత్వం చిక్కుకుపోయిందని, అందుకే భయపడుతున్నారని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోతుందన్న భయంతో ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని గుప్తా పేర్కొన్నారు. తప్పు చేయనివారికి భయమెందుకన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్ఘన్ పరిణామాలను చూసి గుణపాఠం నేర్చుకోండి.. కేంద్రానికి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ చురక.. బీజేపీ ఖండన

Afghanistan Crisis: అమెరికా మిలటరీ విమానంలో ప్రసవించిన ఆఫ్గన్ మహిళ.. జర్మనీలో చికిత్స..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!