వావ్ ! దాల్ సరస్సులోని హౌస్ బోట్ లో ‘ఫ్లోటింగ్ ఏటీఎం’ ! చూడాల్సిందే !
శ్రీనగర్ లోని ప్రముఖ దాల్ సరస్సు అందాలను వీక్షించాలనుకునేవారికి..సరస్సులోని బోటులో సరదాగా విహరించాలని మనసు పడే టూరిస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీ ఐ) ఓ వినూత్న 'గిఫ్ట్' ఇచ్చింది.
శ్రీనగర్ లోని ప్రముఖ దాల్ సరస్సు అందాలను వీక్షించాలనుకునేవారికి..సరస్సులోని బోటులో సరదాగా విహరించాలని మనసు పడే టూరిస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీ ఐ) ఓ వినూత్న ‘గిఫ్ట్’ ఇచ్చింది. ఈ సరస్సు లోని హౌస్ బోటులో ‘ఫ్లోటింగ్’ (తేలియాడే) ఎనీ టైం మిషన్ (ఏటీఎం) ని ఏర్పాటు చేసింది. దీన్ని తమ బ్యాంకు చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఈ నెల 16 న ప్రారంభించినట్టు ఈ బ్యాంకు ట్వీట్ చేసింది. స్థానికులకు, టూరిస్టులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఈ బ్యాంకు ఇలాంటి ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2004 లోనే కేరళలో కూడా ఫ్లోటింగ్ ఏటీఎంను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు శ్రీనగర్ లోని దాల్ సరస్సులో ఈ సౌలభ్యాన్ని ప్రారంభించడం ముఖ్యంగా టూరిస్టులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు కారణం ఏ ఏటికా ఏడు వీరి సంఖ్య పెరిపోతుండడమే.
ఈ సరస్సులో ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ వెజిటబుల్ మార్కెట్, ఫ్లోటింగ్ పోస్టాఫీసు కూడా ఉండడం విశేషం. ఇక చెప్పేదేముంది ?
మరిన్ని ఇక్కడ చూడండి: కాబూల్ విమానాశ్రయంలో తొక్కిసలాట.. ఏడుగురు ఆఫ్ఘన్ల మృతి..గాలిలోకి తాలిబన్ల కాల్పులు ..?
Formula 4 Indian Championship: తగ్గేదే లే.. మన హైదరాబాద్‌లో ఇంటర్‌నేషనల్ కార్ రేసింగ్