Formula 4 Indian Championship: తగ్గేదే లే.. మన హైదరాబాద్‌లో ఇంటర్‌నేషనల్‌ కార్ రేసింగ్‌

ఇంటర్‌నేషనల్‌ కారు రేసింగ్‌ అంటే ఆ కిక్కే వేరు. అదే కిక్‌ మన ఇండియాకి, అదీ హైదరాబాద్‌కి వస్తే.. ఆ లెవలే వేరు కదా. యస్, ఇంటర్నేషల్‌ రేసింగ్...

Formula 4 Indian Championship: తగ్గేదే లే.. మన హైదరాబాద్‌లో ఇంటర్‌నేషనల్‌ కార్ రేసింగ్‌
F3 Car Launch
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 22, 2021 | 7:29 PM

ఇంటర్‌నేషనల్‌ కార్ రేసింగ్‌ అంటే ఆ కిక్కే వేరు. అదే కిక్‌ మన ఇండియాకి, అదీ హైదరాబాద్‌కి వస్తే.. ఆ లెవలే వేరు కదా. యస్, ఇంటర్నేషల్‌ రేసింగ్ కోసం దేశంలో 5 మహానగరాలు రెడీ అవుతున్నాయి. అందుకు కన్ఫామ్ అయిన సిటీస్‌లో ఒకటి ముంబై అయితే.. రెండోది హైదరాబాద్‌. సో.. దేశంలోని మొట్టమొదటి ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్, ఫార్ములా రీజినల్ ఇండియన్ ఛాంపియన్‌షిప్‌కు FIA గ్రేడ్ స్ట్రీట్ సర్క్యూట్ అవుతుంది. 2022లో ఫిబ్రవరిలో రెయ్యిమంటూ ఫార్ములా 4 రేసింగ్‌ జరగబోతోంది. అందుకు సంబంధించిన ప్రమోషన్‌ను రేసింగ్‌ సర్క్యూట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గచ్చిబౌలీలో షురూచేసింది. అతిథులుగా మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, పీపీ రెడ్డి హాజర్యయారు. ఫ్లాగ్ ఆఫ్ F3 కారును ప్రారంభించారు. ఎగ్జిబిషన్ రేసు నగరంలోని ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్‌ నుంచి ప్రారంభమై మాదాపూర్‌లో ముగిసింది. ఇందులో భాగంగానే ఫార్మూలా 3 కారును, లివరీ కూడా ప్రారంభించారు.

ఎఫ్‌-3 కార్లతో నిర్వహించబోయే ఈ పోటీలు భారత్‌లో తొలిసారి. వీటి నిర్వహణ కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే వంద కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కార్లు, రేసింగ్‌కి కావల్సిన వసతుల కోసం వెచ్చించారు. 2022లో ప్రారంభం అయ్యే ఈ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఒక నెల పాటు కొనసాగుతుంది. ఫార్ములా 4 రేస్‌, స్ట్రీట్‌ సర్క్యూట్స్‌కి కేరాఫ్‌గా మనం అఖిలేష్‌రెడ్డిని చెప్పుకోవాలి. ఇండియా అంతటా ఫార్ములా 4 రేస్‌ను ప్రమోట్ చేస్తున్న ఆయన.. మోటార్ స్పోర్ట్స్‌కు ఇండియాలో బాగా పాపులారిటీ తీసుకొచ్చే సంకల్పంతో ఉన్నారు. మంచి రేసర్స్‌ను ప్రోత్సహించడం, వాళ్లకు అవసరమైన ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్‌ చేయడం లక్ష్యమని  అఖిలేష్‌ రెడ్డి చెబుతున్నారు.

Also Read:ఉత్తేజ్ కూతురు పాటకు అకీరా మ్యూజిక్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

తెలుగు రాష్ట్రాల్లో డెత్ మిస్టరీలు.. విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ సింధు మరణం వెనుక బోలెడు ప్రశ్నలు