కాబూల్ విమానాశ్రయంలో తొక్కిసలాట.. ఏడుగురు ఆఫ్ఘన్ల మృతి..గాలిలోకి తాలిబన్ల కాల్పులు ..?

కాబూల్ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్లు మరణించారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, అయితే ఇక్కడ చేరినవారిని రక్షించేందుకు, సాధారణ పరిస్థితి నెలకొనేలా చూసేందుకు తాము యత్నిస్తున్నామని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది

కాబూల్ విమానాశ్రయంలో  తొక్కిసలాట.. ఏడుగురు ఆఫ్ఘన్ల మృతి..గాలిలోకి తాలిబన్ల కాల్పులు ..?
Kabool Airport
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 22, 2021 | 7:27 PM

కాబూల్ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్లు మరణించారు. పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, అయితే ఇక్కడ చేరినవారిని రక్షించేందుకు, సాధారణ పరిస్థితి నెలకొనేలా చూసేందుకు తాము యత్నిస్తున్నామని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న నలుగురు ఆఫ్ఘన్ మహిళలు తొక్కిసలాటలో మృతి చెందినట్టు బ్రిటిష్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ తెలిపారు. తాలిబన్లు ఈ నగరాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి వేలాది ప్రజలు ఇక్కడి నుంచి పారిపోవడానికి యత్నిస్తున్నారు. వీరిని ఆపడానికి తాలిబన్లు యత్నిస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తమవుతోంది. ఆదివారం కాబూల్ ఎయిర్ పోర్టులో వీరు గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నెల 31 లోగా ఏ దేశం కూడా పూర్తిగా తమవారిని సురక్షితంగా స్వదేశానికి తరలించజాలదని బెన్ వాలెస్ పేర్కొన్నారు. ఆఫ్ఘన్ నుంచి తమ దళాల సంపూర్ణ ఉపసంహరణకు ఈ తేదీని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ డెడ్ లైన్ గా నిర్దేశించారన్నారు. ఈ దేశంలో ఇంకా వెయ్యి మంది బ్రిటిష్ సైనికులు ఉన్నారు. ‘ఆపరేషన్ ఫిటింగ్ ఇవాక్యుయేషన్ మిషన్’ పేరిట తమ దేశస్థులను తరలిస్తున్నారు. కాబూల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న ఈ వారం రోజుల్లో వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు. ప్రస్తుతం ఇక్కడ 6 వేలమంది అమెరికన్ సైనికులు ఉన్నారని, వీరి సపోర్ట్ లేనిదే ఎంతోకాలం తామిక్కడ ఉండజాలమని బ్రిటిష్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇలా ఉండగా కాబూల్ విమానాశ్రయానికి వెళ్లవద్దని, మార్గమధ్యంలో తాలిబన్లు మిమ్మల్ని హైజాక్ చేయవచ్చునని అమెరికా తమ దేశ పౌరులను హెచ్చరించింది. విమానాశ్రయంలోని యూఎస్ సైడ్ విభాగం 48 గంటలపాటు మూసి ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే బ్రిటిష్ సెక్షన్ మాత్రం పని చేస్తుందని తెలిపింది. మరోవైపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్ నేతలు ముల్లా బరాదర్, సిరాజ్ హకానీ కాబూల్ చేరుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Formula 4 Indian Championship: తగ్గేదే లే.. మన హైదరాబాద్‌లో ఇంటర్‌నేషనల్‌ కార్ రేసింగ్‌

Raksha Bandhan: జబర్దస్త్‌ సెలబ్రెటీల రాఖీ పండగ సెలబ్రేషన్స్.. ఇమాన్యుయేల్‌కు రాఖీ కట్టిన రోహిణి