AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis: తాలిబన్లని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతోన్న పంజ్‌షిర్‌ వాసులు.. అక్కడ అడుగుపెడితే వారికి చావే

ఆఫ్ఘన్ మొత్తానికీ తాలిబన్లు నరకం చూపిస్తున్నారు. అలాంటి తాలిబన్లనే పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతోంది ఓ రీజియన్‌. ఒక్కమాటలో చెప్పాలంటే దేశమంతంటకీ...

Afghanistan Crisis: తాలిబన్లని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతోన్న పంజ్‌షిర్‌ వాసులు.. అక్కడ అడుగుపెడితే వారికి చావే
Panjshir
Ram Naramaneni
|

Updated on: Aug 23, 2021 | 11:00 AM

Share

ఆఫ్ఘన్ మొత్తానికీ తాలిబన్లు నరకం చూపిస్తున్నారు. అలాంటి తాలిబన్లనే పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతోంది ఓ రీజియన్‌. ఒక్కమాటలో చెప్పాలంటే దేశమంతంటకీ మీరు తాలిబన్లు కావచ్చు, మాకు మాత్రం ఉగ్రవాదులు, తీవ్రవాదులు అన్నట్లు ప్రతిఘటిస్తున్నాయి అక్కడి నార్తరన్‌ అలయెన్స్‌ బలగాలు. మేం దేశాన్ని కమ్మేశాం. మీరు కూడా లొంగిపోండీ అంటూ అల్టిమేటం విధించిన తాలిబన్లకు తిరిగి కౌంటర్ ఇచ్చాయి తిరుగుబాటు దళాలు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికీ అక్కడ హోరెత్తే యుద్దకాండ జరుగుతోంది.. ! ఈ సమరంలో ఓటమి అంచులో ఉంది తాలిబన్‌ సైన్యం.

పంజ్‌షిర్‌.. ఇదీ ఆఫ్ఘన్‌లో ప్రాంతమే. పంజ్‌షిర్ అంటే 5 సింహాలు అని అర్థం. ఆప్ఘన్ రాజధాని 125కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. పేరుకు ఆఫ్ఘన్‌లోనే ఉన్నా.. అక్కడి ప్రజలకు వ్యతిరేకంగా ఏ శక్తీ ఇక్కడ అడుగుపెట్టే సీన్‌ లేదు. స్వతంత్య్ర దేశంగా ఉన్నప్పుడే పంజ్‌షీర్ తనకు తాను సొంతగా ఉండేది. ఇక్కడ మొత్తం జనాభా లక్షన్నర మంది. ఇక్కడ సైన్యాన్ని లీడ్ చేస్తున్న వాళ్లు అమ్రుల్లా సలేహ్‌, అహ్మద్‌ మసూద్‌. ఇప్పుడే కాదు.. 1985లో రష్యా నాటో బలగాలు.. 1990లో తాలిబన్లు కూడా ఈ ప్రాంతాన్నీ ఏ మాత్రం కదల్చలేకపోయారు. కాదూ కూడదని అక్కడ కాలుపెట్టే ప్రయత్నం చేస్తే వచ్చినవాడు వచ్చినట్లు చావడమే. తాజాగా పంజ్‌షిర్‌లో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. ఆ ట్రయల్ వేశారో లేదో ఇలా బ్లాస్ట్‌తో తునాతునకలైపోయారు. అదీ నార్తరన్‌ అలయెన్స్ బలగాల దెబ్బ. ఇలాగే ఏ తాలిబన్ అక్కడ అడుగుపెట్టినా చావును చూపిస్తున్నారు పంజ్‌షిర్‌ వాసులు.

శత్రుదుర్బేద్యమైన పంజ్‌షిర్‌ హిందూఖుష్‌ పర్వతశ్రేణులు ఉన్న ప్రాంతం. వీటి మధ్యలో లోయలా ఉంటుంది పంజ్‌షిర్ రిజీయన్‌. ఇందులో వార్దక్‌, కపిసా, పర్వన్‌, తఖర్‌, బాగ్లాన్‌ లాంటి పేర్లున్న ప్రాంతాలున్నాయి. చుట్టూ పర్వతాలు ఉండడంతో పంజ్‌షిర్‌లో వెళ్లాలంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంటుంది. ఓ నది పొడవునా ఉన్న సన్నటి దారిలో నుంచే ఎవరైనా వెళ్లాలి. పంజ్‌షీర్ వాసులకు భౌగోళికంగా కలిసొస్తున్నది అదే. తమను వ్యతిరేకించేవాళ్లు ఎవరు ఆ దారిలో నుంచి వచ్చినా గెరిల్లా పోరాటం చేస్తారు వాళ్లు. ప్రత్యర్థులు అటూ ఇటూ చూసేలోపే.. ఎటువైపు వస్తుందో గానీ తుటా వచ్చి గుండెల్ని చీల్చేస్తుంది. బాంబుల వర్షం కురుస్తుంది. దాని ఎఫెక్టే ఇప్పుడు వందలాది మంది తాలిబన్ల మరణం.  1985లో, 1990లో పంజ్‌షీర్‌ ప్రాంతాన్ని నడిపించిన నాయకుడు మహ్మద్‌ షా మసూద్‌. అప్పట్లో ఆ ప్రాంతాన్ని గెలవలేక.. తర్వాత తాలిబన్లు ఆయన్ను కుట్రపూరితంగా చంపేశారు. విలేఖర్ల రూపంలో వెళ్లి ఆత్మాహుతి దాడి చేశారు. ఇప్పుడు ఆయన కొడుకు అహ్మద్‌ మసూద్‌ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. ఆయనతోపాటు ఆప్ఘన్‌కి ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్‌ కలిశాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు పంజ్‌షీర్‌లో తిరుగుబాటు నడిపిస్తున్నారు.

Also Read:ఆ ప్రాంతాలలో సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు అమ్ముతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక

 డ్యాన్స్ చేసిన నర్సుకు లక్షల మంది మద్దతు.. చర్యలపై వెనక్కు తగ్గిన అధికార యంత్రాంగం