AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet bandi song: డ్యాన్స్ చేసిన నర్సుకు లక్షల మంది మద్దతు.. చర్యలపై వెనక్కు తగ్గిన అధికార యంత్రాంగం

బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలుసు. పెళ్లి బరాత్‌లో వధువు, వరుడుకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో..

Bullet bandi song: డ్యాన్స్ చేసిన నర్సుకు లక్షల మంది మద్దతు.. చర్యలపై వెనక్కు తగ్గిన అధికార యంత్రాంగం
Nurse Song
Ram Naramaneni
|

Updated on: Aug 23, 2021 | 10:47 AM

Share

బుల్లెట్ బండి పాట ఎంత పాపులర్‌ అయిందో అందరికి తెలుసు. పెళ్లి బరాత్‌లో వధువు, వరుడుకు సర్‌ప్రైజ్‌ ఇస్తూ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో.. ఫుల్‌ ట్రెండ్‌ అయింది. డ్యాన్స్‌తో కొత్త జంటకు సెలబ్రిటీ హోదా వచ్చింది. అయితే అదే పాట ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. అవును అదే సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి, చిక్కులో పడిందో నర్సు. పంద్రాగస్టు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి PHCలో ఓ నర్సు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్‌ చేసింది.  ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.   జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ రావుఈ వ్యవహారంపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. ఆన్‌ డ్యూటీలో ఉండటమే కాకుండా.. ఇండిపెండెంట్స్‌ డే రోజున ఇలా పాటలు పెట్టుకోని డ్యాన్స్‌లు చేయడంపై మండిపడ్డారు. డ్యాన్స్‌ చేసిన మహిళకు మెమో జారీ చేశారు. కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్న రజని.. కరోనా రోగులకు సేవలు చేసిన క్రమంలో తాను కూడా వైరస్‌ బారిన పడ్డారు. అనంతరం కోలుకొన్నారు. పంద్రాగస్టు రోజున తోటి ఉద్యోగులు ఎంకరేజ్‌ చేస్తేనే తాను డ్యాన్స్‌ చేశానని ఆమె అంటోంది. తాను డ్యూటీకి డుమ్మా కొట్టి ఎంజాయ్‌ చేయలేదని ఆమె చెప్తోంది. అయితే జ్యోతికి మెమో జారీ చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.  స్టాఫ్​ నర్స్​కు లక్షలాది మద్దతుగా నిలుస్తున్నారు. మెమో వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు సైతం రజినికి సపోర్ట్​ చేస్తున్నారు. చర్యలు వద్దని అధికారులను కోరుతున్నారు. ఈ మేరకు కేటీఆర్​కు సైతం సోషల్ మీడియాలో వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం పునరాలోచనలో పడింది. ఆగస్టు 15 ఆదివారం అందునా సెలవు దినం అవ్వడంతో ఆమె సేఫ్‌ జోన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం అందుతోంది. మొదటి తప్పుగా భావించి.. ఇంకోసారి ఇలాంటి రిపీట్ చెయ్యకుండా మందలించి వదిలేయనున్నారని సమాచారం.

నర్సుకు మద్దతుగా మాట్లాడిన మహిళ వీడియో

అసలు ఈ బుల్లెట్ బండి సాంగ్ ఎవరు పాడారు…

ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’  సాంగ్‌ను  ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించారు. లక్ష్మణ్‌ రచించిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించారు.  ఆగస్టు ఏప్రిల్‌ 7న యూట్యూబ్‌‌లో విడుదలైన ఈ ప్రవేట్ సాంగ్ కోట్ల వ్యూస్ దక్కించుకుంది.  లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి.

Also Read:Vijayawada: అన్నకు రాఖీ కట్టిన కాసేపటికే అత్తింట్లో మరణం.. అసలేం జరిగింది..?

Andhra Pradesh: ఆ ప్రాంతాలలో సిగరెట్లు, ఇతర పొగాకు పదార్థాలు అమ్ముతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?