Chiranjeevi: చిరు ఇంట కన్నుల పండుగ.. రక్షా బంధన్, బర్త్ డే వేడుక, బ్రదర్స్‌కు రాఖీలు కట్టిన మెగా సోదరీమణులు.. వాచ్ వీడియో
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షా బంధన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చిరంజీవి సోదరీమణులు తమ సోదరులకు..

Chiranjeevi sisters Rakhi: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షా బంధన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. చిరంజీవి సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఇవాళ రాఖీ పౌర్ణమి పర్వదినంతోపాటు, చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో చిరంజీవి ఇళ్లు శోభాయమానంగా వెలిగిపోయింది.

మెగా హీరోలంతా కలిసి చిరు ఇంట సందడి చేశారు. పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా సోదరీమణులిద్దరు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల నుదుట తిలకందిద్ది చేతికి రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి తల్లి అంజనా దేవి పక్కనే ఉండి వేడుకని కనులారా తిలకించి ఆస్వాదించారు.

ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు కూడా కావడంతో చిరంజీవి తల్లి అంజనా దేవితోపాటు, ఫ్యామిలీ మొత్తం ఆడ, మగ, చిన్నా, పెద్దా అందరూ కలిసి రాఖీ పౌర్ణమిని ప్రేమానురాగాలతో సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇక, టాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలుగురు సీని ప్రముఖులు, రాజకీయా నాయకులు, మిత్రులు, మరియు అభిమానులు చిరంజీవికి పుట్టిన రోజు శుభా కాంక్షలు చెప్పారు.

చిరంజీవి ఇంట రాఖీ పండుగ సందడి ఫుల్ వీడియో..