Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: ఫ్లెక్సీలు కట్టారు.. హాడావుడి చేశారు..! కానీ, ఆ మాజీ మంత్రికి బీజేపీ నుంచి పిలుపేరాలేదు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. అధిష్టానం సూచనలతో ముందుకు వెళుతూ చేరికలపై దృష్టి సారించింది. అయితే, కృష్ణా యాదవ్ చేరిక అంశం మరోసారి బీజేపీ నేతల మధ్య దూరం పెంచింది. ఆయన జాయినింగ్‌ను పార్టీలోని కొందరు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్టు సమాచారం. దీంతో అయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం సందిగ్ధంలో పడింది.

Telangana BJP: ఫ్లెక్సీలు కట్టారు.. హాడావుడి చేశారు..! కానీ, ఆ మాజీ మంత్రికి బీజేపీ నుంచి పిలుపేరాలేదు..
Telangana BJP
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 31, 2023 | 5:19 PM

హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. అధిష్టానం సూచనలతో ముందుకు వెళుతూ చేరికలపై దృష్టి సారించింది. అయితే, కృష్ణా యాదవ్ చేరిక అంశం మరోసారి బీజేపీ నేతల మధ్య దూరం పెంచింది. ఆయన జాయినింగ్‌ను పార్టీలోని కొందరు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్టు సమాచారం. దీంతో అయన కాషాయ తీర్థం పుచ్చుకోవడం సందిగ్ధంలో పడింది. తాజాగా.. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ చేరిక వ్యవహారం బీజేపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన రీసెంట్‌గా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 30న చేరేందుకు సిద్ధం అయ్యారు. ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. తనమంది మార్భలానికి కూడా సమాచారం ఇచ్చుకున్నారు. భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.

అయితే అదే రోజు బీజేపీలో చేరేందుకు బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు చేరారు. ఆయన చేరికకు సంబంధించి బీజేపీ నుంచి మీడియాకు సమాచారం వచ్చింది. అయితే కృష్ణ యాదవ్‌కి సంబంధించి మాత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి సమాచారం లేదు. కృష్ణా యాదవ్ తాను చేరుతున్నట్టుగా మీడియా కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే కృష్ణ యాదవ్ చేరికను బీజేపీలోని బడా నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.. హైదరాబాద్‌కు చెందిన నేతలే అయన చెరికను అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఆయన గతంలో అంబర్‌పేట్ నుండి ప్రాతినిధ్యం వహించడం.. ఇప్పుడు కూడా ఆ సీట్‌నే ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నరేంద్ర ఉన్నన్ని రోజులు కృష్ణా యాదవ్ పోటీగా ఉండేవారు.. ఆ రెండు ఫ్యామిలీలు వైరం కొనసాగుతూనే ఉందని సమాచారం.. అంతేకాకుండా కృష్ణా యాదవ్ గత చరిత్రపై కూడా బీజేపీలో చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, కృష్ణా యాదవ్ ను పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నం చేసింది ఈటల రాజేందర్.. పూర్తి స్థాయిలో డిస్కషన్ పార్టీలో జరగకుండానే ఆయన జాయినింగ్ తేదీని ఖరారు చేసినట్టు సమాచారం..

Krishna Yadav

Krishna Yadav

ఈ క్రమంలో చేరికపై స్పష్టత రాకపోవడంతో కృష్ణయాదవ్ తన సహచరులు, అనుచరులు అందరినీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సమీపంలోని ఒక గార్డెన్ కి రమ్మని సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడ సమావేశం అవ్వడంతో చివరి వరకు లెన్షన్ కొనసాగింది. ఆ తర్వాత వారంతా చర్చించుకుని వెళ్లిపోయారు. తాజాగా జరిగిన ఈ పరిణామంతో బీజేపీ నేతల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని.. ఇది పార్టీ చేరికలపై ప్రభావం పడుతుందని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..