AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాష్ట్రానికే ఏమీ చేయలేదు.. ఇక దేశానికి ఏం చేస్తారు.. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్

తెలంగాణలో రాజకీయాలు వాడీవేడిగా మారుతున్నాయి. జాతీయ స్థాయి పాలిటిక్స్ లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు...

Telangana: రాష్ట్రానికే ఏమీ చేయలేదు.. ఇక దేశానికి ఏం చేస్తారు.. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై భగ్గుమన్న కాంగ్రెస్
Madhuyashki Goud
Ganesh Mudavath
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 04, 2022 | 2:12 PM

Share

తెలంగాణలో రాజకీయాలు వాడీవేడిగా మారుతున్నాయి. జాతీయ స్థాయి పాలిటిక్స్ లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 5 దసరా పర్వదినం సందర్భంగా పార్టీ పేరును బహిరంగంగా ప్రకటించనున్నారు. దీంతో టీఆర్ఎస్ తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత 8 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల ఆకాంక్ష ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ రాజకీయ కాంక్ష కోసం ఉద్యమ పార్టీ అని పెట్టి టీఆర్ఎస్ ను స్థాపించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ కాంక్షను విస్తరించడానికి జాతీయ పార్టీ పెడుతున్నారని ఆక్షేపించారు. 2014 లో సమైక్య పాలనలో తెలంగాణ కు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ఏర్పాటు జరిగితే బహుజనులకు, రైతులకు న్యాయం జరుగుతుంది చెప్పి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.

బిఅర్ఎస్ మొదలైతే తెలంగాణ టీఆర్ఎస్ కు వాలంటీరి రిటైర్మెంటే. తెలంగాణ కోసం పోరాటం చేసిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆలోచించాలి. జాతీయ పార్టీ పేరుతో కుమారుడు, కుమార్తె, అల్లుడు కు రాజ్య విస్తరణ కోసం జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలి. 8 సంవత్సరాలు పార్టీకి రూ.800 కోట్లు ఉన్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

– మధుయాష్కీ గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్

ఇవి కూడా చదవండి

మరోవైపు.. తెలంగాణలో విఫలమైన కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ఏం చేస్తారని బెల్లయ్య నాయక్ విమర్శించారు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ది కోసమే తెలంగాణ ఉద్యమం చేశారని ఆరోపించారు. ఉద్యమం ద్వారా డబ్బు సంపాదించడం, అధికార దాహం తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనే లేదని మండిపడ్డారు. సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్న తరువాతనే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్న బెల్లయ్య నాయక్.. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కొట్లాడింది తెలంగాణ ప్రజలు నిలబడి పోరాటం చేసింది కాంగ్రెస్ ఎంపీలేనని స్పష్టం చేశారు. సభలు పెట్టి పైసలు వసూలు చేయడం తప్ప కేసీఆర్ కు ఏం తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడనికే బిఅర్ఎస్ ను స్థాపిస్తున్నారని ఆరోపించారు.

కాగా.. జాతీయ పార్టీ ఏర్పాటు వైపు కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. దసరా రోజున పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించారు. బుధవారం సమావేశానికి 283 మందిని ఆహ్వానించారు. సరిగ్గా మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ పేరు ప్రకటించనున్నారు. దసరా రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రసంగిస్తారు. అనంతరం టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ ఏకవాక్య తీర్మానం చేస్తారు. దీనికి సభ్యుల మద్దతు తెలిపిన అనంతరం ఆమోదిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం…