Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం.. ఎక్కడిక్కడ నిలిచిపోయిన రైళ్లు.. ఇబ్బంది పడిన ప్రయాణికులు..
మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దసర సెలవులు, ఇతర ప్రాంతాలు వెళ్లాల్సినవారు ఒకవైపు.. పండుగ షాపింగ్ కోసం వచ్చినవారితో మెట్రో స్టేషన్లు..
హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తున్న మెట్రోలో ఈ ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. రైళ్లు ఉదయం చాలా సమయం పాటు కదల్లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బ,దులు ఎదుర్కొన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన లోపమే ఇందుకు కారణమని తెలుస్తుండగా.. దాన్ని సరిదిద్దేందుకు మెట్రో అధికారులు శ్రమించినట్లుగా తెలుస్తోంది. రైళ్లు ఎక్కిన వారు గమ్యస్థానాలకు చేరాల్సిన సమయంలో చేరలేని పరిస్థతి ఏర్పడింది. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే పని ఉన్నారు మెట్రో అధికారులు. సాంకేతిక లోపంతో 45 నిమిషాలకు పైగా మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వీలైనంత త్వరగా సర్వీసులను పునరుద్ధరించేందుకు హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా మెట్రో సర్వీసులు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.
ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మెట్రో స్టేషన్ల వద్ద వేచి ఉన్న ప్రయాణికులు ఈ విషయమై మెట్రో రైల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సమస్యతో నిలిచిన మెట్రో సేవలు..
మెట్రోలో సాంకేతిక సమస్య తలెత్తడంతో చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దసర సెలవులు, ఇతర ప్రాంతాలు వెళ్లాల్సినవారు ఒకవైపు.. పండుగ షాపింగ్ కోసం వచ్చినవారితో మెట్రో స్టేషన్లు పూర్తిగా నిండిపోయి రద్దీగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులతో కిక్కిరుస్తున్న మెట్రో స్టేషన్స్. ఇతర ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూశారు. ఉదయం సాంకేతిక సమస్య తలెత్తాయి. సమస్యపై అధికారులు, సిబ్బంది ఇంతవరకు స్పందించలేదు. దీంతో మెట్రో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..