AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: తెలంగాణలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Telangana: హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

CM Revanth Reddy: తెలంగాణలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
Anand T
|

Updated on: May 21, 2025 | 5:44 PM

Share

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షాలు పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం తెలిపారు. ధాన్యం రోడ్లపై ఆరబోస్తే తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు అన్నారు.

హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాలతో పాటు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో చెట్లు, విద్యుత్‌ స్థంభాలు విరిగిపడే అవకాశం ఉందని..అలాంటివి సంభవిస్తే వెంటనే క్లియర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ, పోలీస్​, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత రెండు మూడు రోజులుగా ఉదయం నుంచి ఎండవేడితో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు వరుణుడు ఉపసమనాన్ని కలిగించాడు. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఎండల నుంచి ఉపసమనం పొందుతున్నారు. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. కాగా మరో రెండ్రోజుల్లో ఈ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
తులసి మొక్కకు ఎరుపు దారం కడితే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా?
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి కొత్త..
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
5 సినిమాలతో వేసవి వినోదానికి మెగా ఫ్యామిలీ రెడీ
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
శివరాత్రి నాడు శివుడికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే ఎన్ని లాభాలో
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
ఎస్సార్‌ నగర్‌లో కాస్త కంగారుగా కనిపించిన మహిళ.. ఆపి విచారించగా..
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
షెకావత్ రోల్‌ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా.?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. తొలి మ్యాచ్ నుంచి బుమ్రా ఔట్?
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
రోజూ వాడే ఉప్పు గురించి ఎవరికీ తెలియని నిజం! అసలు విషయం తెలిస్తే
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..
అప్పుడు సౌందర్య కూతురిగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా..