Corona Effect: కరోనా ప్రభావం మళ్లీ మొదలైందిగా… కీలక నిర్ణయం తీసుకున్న బేగం బజార్ వ్యాపారులు..
Corona Effect: కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మరోవైపు...
Corona Effect: కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూ అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలు చూస్తుంటే గతేడాది తాలూకు సంఘటనలు గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా గతేడాది కరోనా వ్యాప్తి తారా స్థాయిలో ఉన్న సమయంలో కొన్ని వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేశాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిణామాలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టించింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్కెట్‌లోని దుకాణాల వేళల్లో మార్పులు చేస్తూ ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరుస్తామని, సాయంత్రం 5 గంటలకు షాపులను మూసివేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. బేగంబజార్, ఛత్రి, ఫిష్ మార్కెట్, మిట్టికా షేర్ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్ నిబంధనలను పాటిస్తాయని చెప్పారు. వ్యాపారులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు.
Today weather: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం.. కారణం అదేనా?
Telangana Governor : కొండరెడ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గవర్నర్ తమిళి సై.. ఎందుకో తెలుసా..?