Cyber Crime: గూగుల్ సెర్చ్‌లో ఫోన్ నెంబర్లు వెతుకుతున్నారా..? మీ ఖాతా ఖాళీ అవ్వొచ్చు.. హెచ్చరిస్తోన్న పోలీసులు..
Cyber Crime: ప్రస్తుతం ఓ చిన్న అవసరం వచ్చినా సరే వెంటనే గూగుల్ సెర్చ్‌లో వెతికేస్తున్నారు. అన్ని ప్రశ్నలకు గూగుల్ ఒక్కటే వేదిక అన్నట్లు దానివైపు చూపుస్తున్నారు. ఇక ఏదైనా సంస్థ గురించి తెలుసుకోవాలన్నా, సమాచారం కావాలన్నా...
Cyber Crime: ప్రస్తుతం ఓ చిన్న అవసరం వచ్చినా సరే వెంటనే గూగుల్ సెర్చ్‌లో వెతికేస్తున్నారు. అన్ని ప్రశ్నలకు గూగుల్ ఒక్కటే వేదిక అన్నట్లు దానివైపు చూపుస్తున్నారు. ఇక ఏదైనా సంస్థ గురించి తెలుసుకోవాలన్నా, సమాచారం కావాలన్నా కూడా గూగులే దిక్కు. అయితే ఈ సమాచారం మాటున ప్రమాదం కూడా దాగుందని మీకు తెలుసా? తప్పుడు సమాచారాన్ని గూగుల్‌లో పెట్టి తప్పుదోవ పట్టించే సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారు. గతేడాది గూగుల్ సెర్చ్ వల్ల జరిగిన మోసాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వివిధ సంస్థల కస్టమర్ కేర్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్లకోసం వెతికిన కొందరు నెటిజన్లు సైబర్ నేరగాళ్ల మాయలో పడి జేబులు ఖాళీ చేసుకున్నారు. గతేడాది ఈ విధంగా కస్టమర్ కేర్ నెంబర్ల కోసం వెతికి 134 మంది దాదాపు రూ. 1.55 కోట్లు కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు. గూగుల్, యాహూ, బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్‌లలో సెర్చ్ చేసి మోసపోవద్దని సూచించారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో బాగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏదైనా సంస్థకు సంబంధించిన ఫోన్ నెంబర్ తెలుసుకోవాలంటే సదరు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సమాచారం తెలుసుకోవాలి తప్ప.. గూగుల్‌లో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మోద్దని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ సెర్చ్‌లో దొరికే నెంబర్లకు ఫోన్ చేసి డబ్బులు కోల్పోవద్దని సూచిస్తున్నారు.
KTR Tweet: ‘తెలంగాణ వస్తే ఏమొస్తది.. కన్నీరు కారిన చోటే’. ఆసక్తికర ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..