AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR Tweet: ‘తెలంగాణ వస్తే ఏమొస్తది.. కన్నీరు కారిన చోటే’. ఆసక్తికర ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌..

KTR Tweet: తెలంగాణ ప్రజల వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. గోదావరి పరవళ్లను తెలంగాణ జిల్లాలకు దారి మళ్లిస్తూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌...

KTR Tweet: 'తెలంగాణ వస్తే ఏమొస్తది.. కన్నీరు కారిన చోటే'. ఆసక్తికర ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌..
Ktr
Narender Vaitla
|

Updated on: Apr 08, 2021 | 8:30 AM

Share

KTR Tweet: తెలంగాణ ప్రజల వర ప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయి. గోదావరి పరవళ్లను తెలంగాణ జిల్లాలకు దారి మళ్లిస్తూ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి నీరు పలు జిల్లాలకు ఇప్పటికే కాలువల ద్వారా చేరుతున్న విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లోని చెరువులు నీటితో కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని గ్రామాలకు ఇప్పటికే గోదావరి జలాలు చేరాయి. దీంతో గ్రామాల్లోని చిన్న చిన్న చెక్‌ డ్యామ్‌లు జల కళను సంతరించుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సైజ్‌ పర్యాటక ప్రదేశంగా మారాయి. గ్రామాలకు చెందిన ప్రజలు గోదావరి నీటిలో తడిసిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా తమ నట్టింటికి వచ్చిన గోదావరి నీటిలో తడుస్తూ ఫొటోలు దిగుతున్నారు. తాజాగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఇలాంటి ఫొటోలే పోస్ట్‌ చేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో గోదావరి జలాలకు సంబంధించిన ఫొటోలు పోస్ట్‌ చేస్తూ.. ‘తెలంగాణ అస్తే ఏమొస్తది.? కన్నీరు కారిన చోటే.. గంగ పరవళ్లు తొక్కింది. ఆనంద భాష్పాలు కురిపిచ్చింది!’ అంటూ ఆసక్తికర క్యాప్షన్‌ జోడించారు. దీంతో ప్రస్తుతం కేటీఆర్‌ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా సీఎం కేసీఆర్‌.. కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి గోదావరి జలాలను వదిలిన విషయం తెలిసిందే. ఎండకాలంలోనూ సాగునీటిని అందించేలా సంగారెడ్డి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో సిద్దిపేట, మెదక్‌ జిల్లాల పరిధిలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌..

Also Read: తెలంగాణ గడ్డపై యాక్టివ్ అయిన జనసేన, వరంగల్ గ్రేటర్ వార్‌లో యుద్ధానికి సై.. భారీ ర్యాలీతో సమరశంఖం

హాలియా నేలపై తెలంగాణ సీఎం అద్భుత చిత్రపటం..గుండెల నిండా “కేసీఆర్‌’… ( వీడియో )

AP MPTC ZPTC Elections 2021 Live: కొనసాగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్.. భారీగా తరలివస్తున్న ఓటర్లు