తెలంగాణ గడ్డపై యాక్టివ్ అయిన జనసేన, వరంగల్ గ్రేటర్ వార్‌లో యుద్ధానికి సై.. భారీ ర్యాలీతో సమరశంఖం

Telangana Janasena : తెలంగాణ గడ్డపై జనసేన యాక్టివ్ అయింది...

  • Venkata Narayana
  • Publish Date - 7:27 pm, Wed, 7 April 21
తెలంగాణ గడ్డపై యాక్టివ్ అయిన జనసేన, వరంగల్ గ్రేటర్ వార్‌లో యుద్ధానికి సై.. భారీ ర్యాలీతో సమరశంఖం
Jana Sena Glass

Telangana Janasena : తెలంగాణ గడ్డపై జనసేన యాక్టివ్ అయింది. వరంగల్ గ్రేటర్‌ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. వరంగల్ గ్రేటర్ వార్‌లో సమరానికి సై అనడమేకాదు, సీన్‌లోకి దిగిపోయి భారీ ర్యాలీతో కాచుకోండంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. నక్కలగుట్టలో ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఇంఛార్జ్ శంకర్ గౌడ్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికలకు కేడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయం ఓరుగల్లు కోట నుంచే ఆరంభం కావాలన్నారాయన. కాకతీయుల పోరాట స్ఫూర్తితో జనసేన పార్టీ అణగారిన వర్గాల గోంతుగా పోరాడుతుందన్నారు శంకర్‌గౌడ్.

సామాన్య యువతకు రాజకీయ అవకాశం కల్పించిన ఘనత జనసేనకే దక్కుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ ఆకుల సుమన్ చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రవేశ పెట్టిన పార్టీ అధినేత ఆశయాలు.. జిల్లా నుంచి ఆచరణలో చూపించబోతున్నామన్నారు. మార్పు ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ పార్టీగా జనసేన ఉండబోతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. డివిజన్, బూతు కమిటీలు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా జనసేన ప్రభావం ఉంటుందన్నారు. ర్యాలీలో భారీ సంఖ్యలో మొత్తానికి జనసేన హడావిడి ప్రధాన పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ ర్యాలీతో కేడర్‌లో ఫుల్ జోష్‌ నింపారు ఉమ్మడి జిల్లా నేతలు.

Read also :  అయ్.. పాయె .!, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని స్పీకర్ కు లేఖ