AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar: కరీంనగర్ జిల్లా మత్స్యశాఖలో అవినీతి భాగోతం.. మహిళా సొసైటీ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు

కరీంనగర్ మత్స్యశాఖలో అవినీతి  చేపలు ఏసీబీకి చిక్కాయి. మత్స్యశాఖ మహిళా సొసైటీ ఏర్పాటు కోసం అవసరమైన అనుమతులు మంజూరు చేయడానికి గాను 50 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు.

Karimnagar: కరీంనగర్ జిల్లా మత్స్యశాఖలో అవినీతి భాగోతం.. మహిళా సొసైటీ ఏర్పాటు కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
Karimnagar
KVD Varma
|

Updated on: Apr 08, 2021 | 11:05 AM

Share

Karimnagar: కరీంనగర్ మత్స్యశాఖలో అవినీతి  చేపలు ఏసీబీకి చిక్కాయి. మత్స్యశాఖ మహిళా సొసైటీ ఏర్పాటు కోసం అవసరమైన అనుమతులు మంజూరు చేయడానికి గాను 50 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కరీంనగర్ ఇంచార్జ్ డీఎస్పీయే మధుసూదన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బండపల్లికి చేయండి పందిరి నర్సయ్య, అయన అల్లుడు జనార్దన్ తమ గ్రామంలో మత్స్యకారుల మహిళా సంఘం ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందుకోసం మార్చి 25వ తేదీన కరీంనగర్ మత్స్య శాఖ జిల్లాఅధికారి మహ్మద్ ఖదీర్ అహ్మద్ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లాకు కూడా ఆయనే ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతోఆయన సంఘం ఏర్పాటుకు 60 వేలు డిమాండ్ చేశారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అంజయ్యను కలవమని చెప్పారు.

దీంతో నర్సయ్య, అంజయ్య పలుమార్లు సిరిసిల్ల జిల్లా కార్యాలయం చుట్టూ తిరిగారు. ఎన్నిసార్లు తిరిగినా వీరికి సంఘం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. చివరకు కనీసం 50 వేల రూపాయలైన ఇస్తేనే కానీ పనిజరగదంటూ అక్కడి అధికారులు వీరికి చెప్పారు. విసిగిపోయిన నర్సయ్య, అంజయ్య ఏసీబీ అధికారులను కలిశారు. వారిసూచనల్ మేరకు అంజయ్యకు పదివేలు బాధితులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధికారి ఖదీర్ అహ్మద్ 40 వేలరూపాయలను తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ అధికారులు ఈ ఇద్దరి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

గతంలో కూడా మత్స్య శాఖలో ఓ ఉద్యోగి ఇలాగే రాయితీ ఆటోలను అందించేందుకుజ్ 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇలా ఈ శాఖలో లంచాల భాగోటం పెరిగిపోతుండటం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకు ముందు రెవెన్యూ శాఖలో ఇలా తరచు అవినీతి సిబ్బంది చిక్కేవారు. ఇప్పుడు ఇతర శాఖల్లోనూ ఇలా జరుగుతుండడం విశేషం. కరీంనగర్ జిల్లాలో మూడేళ్లలో సగటున ఏడాదికి 12 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. ఇలా చిక్కుతున్న వారు కొందరే అనీ..చిక్కకుండా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారనీ ప్రజలు అనుకుంటున్నారు.

Also Read: Mukhtar Ansari: యూపీ బందా జైలుకు గ్యాంగ్‌స్టర్, ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ.. 900 కిలోమీటర్లు భారీ భద్రతతో తరలింపు

దండకారణ్యంలో రక్తపాతం… ఇంకా మావోల చెరలోనే జవాన్ రాకేశ్వర్ సింగ్.. మావోయిస్ట్ లేఖలో మర్మమేంటీ..?