AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukhtar Ansari: యూపీ బందా జైలుకు గ్యాంగ్‌స్టర్ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ.. 900 కిలోమీటర్లు భారీ భద్రతతో తరలింపు

Gangster-Turned-MLA Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని యూపీలోని బందా జైలుకు తరలించారు. పంజాబ్‌లోని

Mukhtar Ansari: యూపీ బందా జైలుకు గ్యాంగ్‌స్టర్ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ.. 900 కిలోమీటర్లు భారీ భద్రతతో తరలింపు
Mukhtar Ansari
Shaik Madar Saheb
| Edited By: Team Veegam|

Updated on: Apr 08, 2021 | 12:45 PM

Share

Gangster-Turned-MLA Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని యూపీలోని బందా జైలుకు తరలించారు. పంజాబ్‌లోని రూప్‌నగర్ జైలు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బాందా జైలుకు భారీ ఎస్కార్ట్ మధ్య పోలీసులు బుధవారం తెల్లవారుజామున తరలించారు. ముక్తార్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర ప్రదేశాల్లో మొత్తం 52 కేసులను ఎదుర్కొంటున్నారు. ఆయనతో పాటు మరో 15 మందిపై కూడా నేరాల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. 52 కేసుల్లో 15 విచారణ దశలో ఉన్నాయి.

అయితే.. ముక్తార్ అన్సారీ 2019 జనవరి నుంచి రూప్‌నగర్ జైలులో ఉంటున్నారు. కాగా ఈ ఏడాది మార్చి 26న ఆయనను పంజాబ్ నుంచి ఉత్తప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సూచనల మేరకే తాజాగా ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఉన్న జైలుకు తరలించారు. అయితే నిన్న పంజాబ్ చేరుకున్న యూపీ పోలీసులు అన్సారీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం వేళ భారీ ఎస్కార్ట్, అంబులెన్స్ సహాయంతో యూపీకి తరలించారు. 900 కిలోమీటర్ల ఈ ప్రయాణం దాదాపు 15 గంటలపాటు కొనసాగింది.

కాగా.. ముక్తార్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన ఐదుసార్లు బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అయితే.. ఆయనపై హత్య, హత్యాయత్నం, మోసం, కుట్ర, దోపిడీ వంటి అభియోగాలు ఉన్నాయి.

Also Read:

Mask Compulsory: కరోనా ఎఫెక్ట్.. వారికీ మాస్క్ మస్టే.. హైకోర్టు సంచలన తీర్పు..

Gold Seized: శంషాబాద్ విమానాశ్రయంలో 1.2 కేజీల బంగారం పట్టివేత.. ప్రయాణికుడు అరెస్ట్