Today weather: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో తేలి‌క‌పాటి వర్షం.. కారణం అదేనా?

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతుండగా.. వాతావరణ శాఖ చల్లని కబురును అందించింది.

Today weather: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో  తేలి‌క‌పాటి వర్షం.. కారణం అదేనా?
Weather Report
Follow us

|

Updated on: Apr 08, 2021 | 6:41 AM

Today weather: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతుండగా.. వాతావరణ శాఖ చల్లని కబురును అందించింది. ఇవాళ తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోందని వెల్లడించారు. నిన్న తమిళనాడు నుండి కర్నాటక మీదుగా మరత్వడా వరకు ఉన్న ఉపరితల ద్రోణి నెలకొని ఉంది. ఇవాళ తమిళనాడు నుండి కర్నాటక వరకు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల వరకు ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

దీని ప్రభా‌వంతో మంచి‌ర్యాల, జయ‌శం‌కర్ భూపా‌ల‌పల్లి, వరం‌గల్‌ అర్బన్‌, వరం‌గ‌ల్‌‌రూ‌రల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజా‌మా‌బాద్‌, కామా‌రెడ్డి, సంగా‌రెడ్డి, వన‌పర్తి, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, జోగు‌లాంబ గద్వాల, వికా‌రా‌బాద్‌ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదే‌శాల్లో గురు‌వారం ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి వర్షం కురిసే అవ‌కాశం ఉందని వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. రేపు, ఎల్లుండి (8,9వ తేదీలలో) పొడి వాతావరణము ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.

మరో వైపు, రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఆర్మూర్‌లోని ఇస్సాపల్లెలో 41.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ అతి తక్కువగా ఆదిలాబాద్‌లో 12 శాతం నమోదైంది.

Read Also… These Five Problems : కివీ పండు గురించి మీకు తెలుసా..? ఈ ఐదు సమస్యలకు చక్కటి పరిష్కారం..! తెలుసుకోండి..