Girl Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్‌ కలకలం.. చిన్నారిని అపహరించేందుకు ప్రయత్నించిన దుండగుడు.. అంతలోనే..

Girl Kidnap In Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో చిన్నారి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపింది. వేల్పూరు మండలం పచ్చల నడిగూడలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించాడు. అయితే..

Girl Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్‌ కలకలం.. చిన్నారిని అపహరించేందుకు ప్రయత్నించిన దుండగుడు.. అంతలోనే..
Kidnap In Nizamabad
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 08, 2021 | 8:15 AM

Girl Kidnap In Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో చిన్నారి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపింది. వేల్పూరు మండలం పచ్చల నడిగూడలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బాలిక ఆ కిడ్నాపర్‌ చెర నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకున్న స్థానికులు అతడిని చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. పచ్చల నడిగూడ గ్రామంలో ఓ వ్యక్తి చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు విశ్వప్రయత్నం చేశాడు. చిన్నారిని ఓ సంచిలో మూట కట్టి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే సంచిని సైకిల్‌పై పెట్టుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బాలిక సంచిలో నుంచి కింద పడిపోవడంతో స్థానికులు గమనించారు. వెంటనే సదరు వ్యక్తిని నిలదీయడంతో సంబంధం లేకుండా సమాధానం చెప్పడంతో అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఆ కిడ్నాపర్‌ను పట్టుకొని చితకబాది పోలసులకు అప్పగించారు. అయితే సదరు వ్యక్తి మాత్రం నేను కిడ్నాప్‌ చేయలేదని వాదించాడు. దీంతో పోలీసులు సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Also Read: పబ్‌జీ ఆడొద్దన్నందుకు ఇంట్లోవారిపైనే కాల్పులు.. ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?

లవర్ నిరాకరించడంతో ఒంటికి నిప్పంటించుకున్న ప్రియుడు.. ఆమె ఇంటి గేటు ముందే ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..

ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఏపీ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌..