AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లవర్ నిరాకరించడంతో ఒంటికి నిప్పంటించుకున్న ప్రియుడు.. ఆమె ఇంటి గేటు ముందే ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..

22 Year Old UP Man Self Immolates : ప్రాణాలంటే ఎవ్వరికి లెక్కలేకుండా పోతుంది.. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు, హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా

లవర్ నిరాకరించడంతో ఒంటికి నిప్పంటించుకున్న ప్రియుడు.. ఆమె ఇంటి గేటు ముందే ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..
Suicide
uppula Raju
|

Updated on: Apr 08, 2021 | 5:25 AM

Share

22 Year Old UP Man Self Immolates : ప్రాణాలంటే ఎవ్వరికి లెక్కలేకుండా పోతుంది.. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు, హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే చంపడమో చావడమో చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియరాలు కలవడానికి నిరాకరించడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బహేరి తహసీల్‌లోని జోఖన్‌పూర్ గ్రామంలో ఆకాశ్‌ అనే వ్యక్తి కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ యువతి సదరు వ్యక్తిని కలవడానికి నిరాకరించింది. దీంతో అతడు కిరోసిన్‌ తాగి ఆమె బంధువుల ఇంటి దగ్గర ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. అనంతరం ఆమెను కలవడానికి ప్రయత్నించాడు.. కుదరకపోవడంతో ఇంటి గేటు ముందే ఒంటికి నిప్పంటించుకున్నాడు.

వెంటనే స్థానికులు గమనించి మంటను ఆర్పడానికి ప్రయత్నించారు. అనంతరం కాలిన గాయాలతో ఆకాశ్‌ను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రేమ వ్యవహారం వల్లే ఈ సంఘటన జరిగిందని ప్రాథమికంగా పోలీసులు నిర్దారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Thirumala seven hills : పొగమంచుతో మరింత అందాన్నిస్తున్న తిరుమల సప్తగిరులు, పరవశించిపోతోన్న భక్తజనం

ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు.. పాకిస్తాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. అసలు ఏమన్నాడో తెలుసా..?

corona lockdown : దేశవ్యాప్తంగా కోరలు చాస్తోన్న కోవిడ్ మహమ్మారి, సంపూర్ణ లాక్ డౌన్లు, కర్ఫ్యూలతో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్