ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు
Drugs in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది..
Drugs in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది. దీంతో డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. దీనిపై తాడేపల్లి పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలతో తాడేపల్లిలోని కె ఎల్ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు నివసిస్తున్న ప్రైవేట్ హాస్టల్స్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తాడేపల్లి ఎస్ఐ వినోద్ కుమార్ బాలకృష్ణ, నాయక్, తరంగిణి ఆధ్వర్యంలో కే ఎల్ యు దగ్గరున్న ప్రైవేట్ హాస్టల్లో లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు పోలీసులు. ప్రైవేట్ హాస్టల్స్‌లోనీ విద్యార్థుల గదుల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌కి సంబంధించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు చెప్పాలన్నారు.
ఇటీవల తాడేపల్లి, మంగళగిరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయారు. దీంతో ఈ ఏరియాలో అధిక శాతం ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో స్టూడెంట్స్ టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్ డ్రగ్స్‌కు అడిక్ట్ అవుతున్నట్లుగా SEB అధికారుల ఎంక్వైరీలో తేలింది. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లా పెనుమాక గ్రామంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారుల తనిఖీల్లో నిషేదిత డ్రగ్స్ MDMA టాబ్లెట్స్ పట్టుబడిపోయాయి. మార్కెట్‌లో ఈ ట్యాబ్లెట్ విలువ 5వేల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇంత మారుమూల ప్రాంతంలో ఖరీదైన డ్రగ్స్ ఎలా వచ్చిందనే డౌట్‌తో తీగ లాగితే డొంక కదిలింది. డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేసి విచారించడంతో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
గుంటూరు, విజయవాడ ఎడ్యుకేషన్‌కి చాలా ఫేమస్ కావడం..చుట్టు పక్కల చాలా పేరు గడించిన యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో ఈ ప్రాంతాన్నే డ్రగ్స్ స్మగర్లు అడ్డాగా మార్చుకున్నట్లు SEB అధికారులు తేల్చారు. ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లిలోని ఇంజనీరింగ్ విద్యార్ధులు విస్తృతంగా గంజాయి వాడుతున్నట్లుగా గుర్తించారు. గతంలో కూడా హెరాయిన్ గుళికలు, కొకైన్ ప్యాకెట్స్‌ను విదేశీ విద్యార్ధుల ద్వారా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా MDMA టాబ్లెట్స్ పట్టుబడటంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఇవెక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీస్తున్నారు. పెనుమాక డ్రగ్స్ సీజ్ కేసులో నలుగుర్ని అదుపులోకి తీసుకొని విచారించగా … మెట్రోనగరాల నుంచి వీటిని తెప్పించి..ఇక్కడి యువతకు అమ్ముతున్నట్లు తేల్చారు. దీంతో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. మాదక ద్రవ్యాల వాడకంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.
Read also : Thirumala seven hills : పొగమంచుతో మరింత అందాన్నిస్తున్న తిరుమల సప్తగిరులు, పరవశించిపోతోన్న భక్తజనం