AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పబ్‌జీ ఆడొద్దన్నందుకు ఇంట్లోవారిపైనే కాల్పులు.. ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?

Man Recreates Video Game Scene : పబ్‌ జీ గేమ్‌ అత్యంత ప్రమాదకరమైందని అందరికి తెలుసు. తాజాగా దీనికి బానిసైన వ్యక్తులు ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరని పాకిస్తాన్‌లో

పబ్‌జీ ఆడొద్దన్నందుకు ఇంట్లోవారిపైనే కాల్పులు.. ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు.. ఎక్కడో తెలుసా..?
uppula Raju
|

Updated on: Apr 08, 2021 | 5:26 AM

Share

Man Recreates Video Game Scene : పబ్‌ జీ గేమ్‌ అత్యంత ప్రమాదకరమైందని అందరికి తెలుసు. తాజాగా దీనికి బానిసైన వ్యక్తులు ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడరని పాకిస్తాన్‌లో జరిగిన సంఘటన రుజువు చేస్తోంది. పబ్‌ జీ గేమ్‌కి బానిసైన ఓ వ్యక్తి ఆటలో మాదిరిగా ఇంట్లో వారిపైనే కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు మృతిచెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆరిన్యూస్ నివేదిక ప్రకారం.. సోమవారం లాహోర్లోని నావా కోట్ సమీపంలో జరిగిన ఓ సంఘటన వీడియో గేమ్‌ని తలపించింది. దీనికి సంబంధించి సీసీ టీవి పుటేజీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. వీడియోలో హెల్మెట్‌, జాకెట్‌ ధరించిన ఓ వ్యక్తి కాల్పులు జరపడాన్ని చూడవచ్చు. ఈ ఘటనపై ఆరా తీయగా అతడు కుటుంబ సభ్యులతో గొడవపడి ఆ తర్వాత కాల్పులు జరపాడని తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న స్థానిక ప్రజలు సంఘటన స్థలానికి వెళ్లారు. ఆ వ్యక్తిని పట్టుకుని తరువాత పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనకు సంబందించిన వీడియో యూట్యూబ్‌లో కూడా చూడవచ్చు. ఈ ఘటనలో నిందితుడి బావ, అతడి స్నేహితుడిని కాల్చి చంపాడు. అంతేకాకుండా అతని తల్లి, సోదరి, సోదరుడు గాయపడ్డారు. ఈ కాల్పుల గురించి పోలీసులు ఈ విధంగా చెప్పారు. నిందితుడు ‘పబ్జీ’ ఆటకు బానిసయ్యాడని, అందువల్ల అతని కుటుంబం అతనిని ఈ ఆట ఆడకుండా ఆపేవారని తెలిసింది. ఈ కారణంగా నిందితుడు మొదట కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడని, మరుసటి రోజు ఎక్కడి నుంచో పిస్టల్ తీసుకొచ్చి అందరిపై బుల్లెట్ల వర్షం కురిపించాడని తెలిపారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు.. పాకిస్తాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. అసలు ఏమన్నాడో తెలుసా..?

ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

Thirumala seven hills : పొగమంచుతో మరింత అందాన్నిస్తున్న తిరుమల సప్తగిరులు, పరవశించిపోతోన్న భక్తజనం