ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపడుతున్న మహిళలు.. పాకిస్తాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలు.. అసలు ఏమన్నాడో తెలుసా..?
Imran Khan Coments : మహిళల వస్త్రధారణ, పరదా పద్దతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై మహిళలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన
Imran Khan Coments : మహిళల వస్త్రధారణ, పరదా పద్దతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై మహిళలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో ఫోన్ ద్వారా నిర్వహించిన మూఖాముఖీ కార్యక్రమంలో భాగంగా ఖాన్ మహిళలపై పెరగుతున్న అత్యాచారాలకు గల కారణాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా దేశంలో జరుగుతున్న లైంగిక నేరాల్లో కేవలం ఒక శాతం మాత్రం మీడియా ద్వారా వెల్లడవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో నానాటికి పెరగుతున్న లైంగిక నేరాలకు కారణం అశ్లీలతే అన్నారు. 70ల్లో తాను క్రికెట్ ఆడేందుకు బ్రిటన్‌కు వెళ్లిన సమయంలో అక్కడి సమాజంలో అశ్లీలత, మాదకద్రవ్యాల కల్చర్ వేళ్లూనుకోవడాన్ని గమనించినట్టు తెలిపారు. ప్రస్తుతం అక్కడ విడాకుల రేటు 70 శాతానికి పెరిగిందని, మితిమీరిన విసృంఖలత్వమే దీనికి కారణమని స్పష్టం చేశారు. అందుకే ఇస్లాంలో పరదా ధరించాలనే నిబంధన కోరికను నియంత్రించేందుకే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ కామెంట్స్‌పై పాకిస్తాన్ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వందలాది మహిళలు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు చేతబూని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఖాన్ వ్యాఖ్యలు రేపిస్టులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన సామూహిక అత్యాచారానికి వ్యతిరేకంగా కరాచీలో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళలపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండించారు. రెండుసార్లు విడాకులు తీసుకున్న ఇమ్రాన్ ఖాన్ లండన్‌లో “ప్లేబాయ్” గా తిరుగుతున్నాడని దుయ్యబట్టారు.