Viral News: ఒళ్లంతా గాయాలే.. బట్టలు లేకుండానే పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి కూతురు రియాక్షన్ ఇది..

Viral News: పెళ్లంటే ఎవరైనా సరే మామూలు హడావుడి చేయరు. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది మొదలు.. రచ్చ రచ్చ చేస్తారు.

  • Shiva Prajapati
  • Publish Date - 10:17 pm, Wed, 7 April 21
Viral News: ఒళ్లంతా గాయాలే.. బట్టలు లేకుండానే పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి కూతురు రియాక్షన్ ఇది..
Marriage

Viral News: పెళ్లంటే ఎవరైనా సరే మామూలు హడావుడి చేయరు. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది మొదలు.. రచ్చ రచ్చ చేస్తారు. గాల్లోనే ప్రణాళికలు రచిస్తూ ఎన్నో కలలు కంటుంటారు. షాపింగ్ అని, కొత్త బట్టలు, బ్యూటీ పార్లర్లు అంటూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో అద్భుతం క్షణం వివాహం. అలాంటి వివాహాన్ని ఘనంగా జరపుకోవాలని, కలకాలం గుర్తుండేలా చేసుకోవాలని సహజంగానే నవ వధు, వరులు భావిస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వరుడు మాత్రం ఒళ్లంతా గాయాలతో.. ఒక్క టవల్ మాత్రమే ధరించి పెళ్లి చేసుకున్నాడు. అవును మీరు విన్నది నిజమే. శరీరం అంతా గాయలు ఉండగా.. ఒక్క టవల్ మాత్రమే అతను ధరించాడు. అతని పక్కన వధువు మాత్రం అదిరిపోయే దుస్తులతో మెరిసిపోయింది. ఈ ఆసక్తికర వివాహం తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వివాహం ఇండోనేషియాలోని జావా ప్రాంతంలో జరిగింది.

అసలు మ్యాటర్‌లోకి వెళితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో పెళ్లి కొడుకు కేవలం టవల్ మాత్రమే ధరించి ఉండగా.. వధువు సాంప్రదాయ వస్త్రధారణలో కూర్చుకుని ఉంది. ఈ విచిత్ర పెళ్లిపై ఆరా తీయగా.. ఆ నవ వధువు అసలు విషయం వెల్లడించింది. ఏప్రిల్ 2వ తేదీన ఎలిండా డ్విక్రిస్టియాని, సుప్రాప్టోకు మధ్య వివాహం జరిగింది. వీరి వివాహం తూర్పు జావాలోని గంగ్జూక్ ప్రాంతంలోని లెంగ్‌కాంగ్‌లో జరిగింది. అయితే పెళ్లికి సరిగ్గా మూడు రోజుల ముందు పెళ్లి కొడుకు సుప్రాస్టో ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చేయి విరిగిపోగా.. ఒళ్లంతా గాయాలయ్యాయి. నిశ్చయించిన పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక అలాగే పెళ్లి తంతుని కానిచ్చేశారు. అప్పటికే తీవ్రంగా గాయాలవడంతో అతనికి కనీసం బట్టలు వేసుకోవడం కూడా రాలేదు. దాంతో ఒంటికి కేవలం టవల్‌పై చుట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. ఫోటోలకు కూడా టవల్‌పైనే ఫోజులు ఇచ్చాడు. పెళ్లి తతంగం అంతా కేవలం ఒక్క టవల్‌పైనే పూర్తి అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో వరుడు.. ఒంటినిండా గాయాలతో ఉన్నాడు.

ఈ ఫోటోలకు నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అసలేం జరిగిందని తెలుసుకోవడానికి కొందరు ఆసక్తికనబరిస్తే.. మరికొందరు సటైరికల్‌గా స్పందించారు. ఇది యాక్సిడెంటల్ మ్యారేజీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చూడటానికి విచిత్రంగా ఉందని, ఇలా కూడా మ్యారేజీ చేసుకుంటారా? అంటూ ఇంకొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

ఆ టైంలో చాలా డిప్రెషన్‏లో ఉండేదాన్ని.. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది.. యాంకర్ అనసూయ కామెంట్స్..

NASA Ingenuity Mars Helicopter : అంతరిక్షంలో అద్భుతాలు, నాసా ప్రవేశపెట్టిన ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్ మార్స్ యానం