- Telugu News Photo Gallery Technology photos Nasa invites public to take flight with ingenuity mars helicopter
NASA Ingenuity Mars Helicopter : అంతరిక్షంలో అద్భుతాలు, నాసా ప్రవేశపెట్టిన ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్ మార్స్ యానం
Ingenuity Mars Helicopter : అంగారకుడిపై సొంతంగా నిలబడ్డ ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్. అక్కడి వాతావరణంలో గగన విహారానికి సన్నద్ధం ..
Updated on: Apr 07, 2021 | 10:00 PM

అంతా అనుకున్నట్టు జరిగితే ఈనెల 11న చరిత్రలో తొలిసారిగా అంగారకుడి పైనుంచి ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్ గగనయానం చేయనుందని చెప్పిన నాసా

పర్సెవరెన్స్ రోవర్‌లో అంతర్భాగంగా ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్‌ను అంగారక గ్రహంపైకి పంపిన నాసా

ఆ రోవర్ ఫిబ్రవరి 18న అరుణ గ్రహంపైనున్న జెజెరో బిలంలో దిగింది. శనివారం ఇన్‌జెన్యుటీ రోవర్ నుంచి విడిపోయిన హెలికాప్టర్.. విజయవంతంగా అంగారకుడిపై కాలు మోపింది

అనంతరం రోవర్ నుంచి ఎలాంటి తోడ్పాటు లేకుండానే అక్కడి వాతావరణాన్ని తట్టుకున్న ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్

అక్కడ రాత్రివేళ చలి.. మైనస్ 90 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. దీన్ని హెలికాప్టర్ విజయవంతంగా ఎదుర్కొందని నాసా తెలిపింది.

1.8 కేజీల బరువుండే ఇన్‌జెన్యుటీ.. తొలి ప్రయత్నంలో సెకనుకు మూడు అడుగుల వేగంతో గాల్లోకి లేస్తుంది. మొత్తం 30 సెకన్ల పాటు గగనవిహారం చేసి.. ఆకాశం నుంచి అంగారక ఉపరితలాన్ని ఫొటోలు తీస్తుంది. భూమికి వెలుపల ఒక గ్రహంపై ఆకాశయానం చేయడం ఇదే తొలిసారి అవుతుంది.



