- Telugu News Photo Gallery Technology photos Mi fan sale 2021 is starting from april 8th and ends on april 13th offering some offers on debit card and credit card
MI Fan Sale 2021: ఎమ్‌ఐ అభిమానులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ‘MI ఫ్యాన్ ఫెస్టివల్ 2021’.. అదిరిపోయే ఆఫర్లు..
MI Fan Sale 2021: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ తయారీ సంస్థ ఎమ్‌ఐ రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా MI ఫ్యాన్ ఫెస్టివల్ 2021 సేల్‌ను నేటి నుంచి (ఏప్రిల్ 8) ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా...
Updated on: Apr 08, 2021 | 6:22 AM

చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ఎమ్‌ఐ. సరికొత్త ప్రొడెక్ట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

స్మార్ట్ ఫోన్‌ల నుంచి స్మార్ట్ టీవీల వరకు రకరకాల గ్యాడ్జెట్స్‌ను తక్కువ ధరకే అందిస్తూ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుపుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా 'MI ఫ్యాన్ ఫెస్టివల్ 2021' పేరుతో ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్ నేడు (మార్చి 8) ప్రారంభమైన ఏప్రిల్ 13తో ముగియనుంది.

ఇందులో భాగంగా యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిడ్ కార్డులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఖాతాదారులకు పలు రకాల ఆఫర్లను అందిస్తోంది.

ఎమ్‌ఐకి చెందిన స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు, తదితర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.

ఇక ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఆఫర్లతో కూడిన విక్రయాలు జరుపుతోంది ఎమ్‌ఐ.




