ఆ టైంలో చాలా డిప్రెషన్‏లో ఉండేదాన్ని.. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది.. యాంకర్ అనసూయ కామెంట్స్..

Anasuya Bharadwaj: అటు టెలివిజన్.. ఇటు వెండితెరపై తన కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది యాంకర్ అనుసూయ భరద్వాజ్. ఇటు పలు షోలే కాకుండా సినిమాల్లో

ఆ టైంలో చాలా డిప్రెషన్‏లో ఉండేదాన్ని.. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది.. యాంకర్ అనసూయ కామెంట్స్..
Anasuya Bharadwaj
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Apr 08, 2021 | 12:59 PM

Anasuya Bharadwaj: అటు టెలివిజన్.. ఇటు వెండితెరపై తన కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది యాంకర్ అనుసూయ భరద్వాజ్. ఇటు పలు షోలే కాకుండా సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ… ఫుల్ బిజీగా మారింది అనసుయ.తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినీ విషయాలను సోషల్ మీడియాలో పంచుకునే అనసూయ.. తనను ట్రోల్ చేసే నెటిజన్లకు కూడా సరైన సమాధానాలిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో తన కెరీర్ విషయాలతోపాటు..తన పెళ్లికి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంది.

జీవితంలో ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తారు. దాని కోసం ప్రత్యేకించి ప్లాన్లు లెక్కలు ఉండకూడదు. ముందుకు వెళ్తున్నానా లేదా అనేది ఆలోచిస్తుంటా అంటా.. ఇప్పిటికీ నేను వార్తలు ఎలా చదివానా అని ఆలోచిస్తా అంటూ చెప్పుకోచ్చింది. ఇక సాక్షిలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు నా వయసు పదహారేళ్లు.. నా బాయ్ ఫ్రెండ్‌కి 19 ఏళ్లు ఉండేవి. మా సీక్రెట్ రిలేషన్ చాలా మందికి తెలియదు కానీ నేను పనిచేస్తున్న సంస్థలో తెలుసు. ఆ టైంలో చాలా డిప్రెషన్‏లో ఉండేదాన్ని.. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది. తను బీహార్, నేను సౌత్, ఇలాంటి ప్రేమ వ్యవహారం చాలా మంది ఇళ్లలో జరిగేదే కానీ నేను అప్పటికే పబ్లిక్ ప్లేస్ లో ఉండటం వల్ల నా పైన రకరకాల కామెంట్స్ చేశారు అంటూ చెప్పుకోచ్చింది. నేను పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో  మా అమ్మ నన్ను చాలా పద్దతిగా పెంచారు.. అయితే ఇప్పుడు మోడ్రన్ డ్రెస్సులు వేసుకుంటున్నా… నా భర్త తో పరిచయం అయిన తర్వాత నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారింది. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా..నాకు పెద్దగా ఏం తెలియదు..  నాకు బిర్లా మందిర్ చూపించింది కూడా మా ఆయనే అంటూ చెప్పుకోచ్చింది.

Also Read: ఆ టాప్ హీరోలు ఇద్దరూ ఫిదా సినిమాను రిజెక్ట్ చేశారు.. సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల కన్నీటి పర్యంతం..

Pushpa Movie: ‘పుష్ప’రాజ్ వచ్చేశాడు.. తగ్గేదేలేదంటున్న బన్నీ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్..

మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప’రాజ్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..