మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప’రాజ్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

Allu Arjun: ఇప్పటివరకు స్టైలీష్ లుక్‏లో కనిపించిన అల్లు అర్జున్.. తొలిసారి డీ గ్లామర్ లుక్కులో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో

మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు 'పుష్ప'రాజ్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
Allu Arjun
Rajitha Chanti

| Edited By: Team Veegam

Apr 07, 2021 | 7:06 PM

Allu Arjun: ఇప్పటివరకు స్టైలీష్ లుక్‏లో కనిపించిన అల్లు అర్జున్.. తొలిసారి డీ గ్లామర్ లుక్కులో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప'(Pushpa). ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే  విడుదలైన పోస్టర్స్‏తో ఈ సినిమా పై ఫుల్ హైప్‏ను క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఇక బన్నీ పూర్తి లుక్‏ను స్క్రీన్ పై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతకొన్ని రోజులుగా మారెడు పల్లి అడవులతోపాటు కేరళ అడువుల్లో సందడి చేసింది పుష్ప టీం. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టేశాడు బన్నీ. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు (Allu Arjun Birthday). ఈ సందర్భంగా ఆడియన్స్ కు బుధవారం (ఏప్రిల్ 7న) సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు పుష్పరాజ్‏ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది సుకుమార్ టీం. ఈ క్రమంలోనే అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని గ్లిమ్ప్స్ రూపంలో వదిలారు మేకర్స్. ఇక ఆ వీడియోతో పుష్ప పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక పుష్ప రాజ్ రోల్ కోసం అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టేశారు.. ప్రస్తుతం నెట్టింట్లో అల్లు అర్జున్ హావా కొనసాగుతోంది.  మంగళవారం దాదాపు 46 మంది సెలబ్రెటీలతో ఒకేసారి బన్నీ సీడీపీని విడుదల చేయించి రికార్డు క్రియేట్ చేశారు ఫ్యాన్స్. ఇక ఈరోజు విడుదలయ్యే పుష్పరాజ్ వీడియో కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఈవెంట్‏ను టీవీ9 లైవ్‏లో చూడవచ్చు.

లైవ్…

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by Sukumar B (@aryasukku)

Also Read: వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక.. డబ్బు.. టైం కూడా లేదు.. ఏ ఒక్కటి ఉన్న ఫైట్ చేస్తా.. ‘పక్కింటి కుర్రాడి’ మాటలు..

‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu