AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక.. డబ్బు.. టైం కూడా లేదు.. ఏ ఒక్కటి ఉన్న ఫైట్ చేస్తా.. ‘పక్కింటి కుర్రాడి’ మాటలు..

యూట్యూబ్‏లో పక్కింటి కుర్రాడు వీడియోలు ఎంత పాపులారిటీని సొంతం చేసుకున్నాయో తెలిసిన విషయమే. తమడా మీడియా, విరల్లీ ప్రెజెంట్స్

వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక.. డబ్బు.. టైం కూడా లేదు.. ఏ ఒక్కటి ఉన్న ఫైట్ చేస్తా.. 'పక్కింటి కుర్రాడి' మాటలు..
Chandu Sai
Rajitha Chanti
|

Updated on: Apr 07, 2021 | 3:05 PM

Share

యూట్యూబ్‏లో పక్కింటి కుర్రాడు వీడియోలు ఎంత పాపులారిటీని సొంతం చేసుకున్నాయో తెలిసిన విషయమే. తమడా మీడియా, విరల్లీ ప్రెజెంట్స్ నిర్మించే వీడియోలు యూట్యూబ్‏లో మిలియన్స్ వ్యూస్‏ క్రాస్ చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. పక్కింటి కుర్కాడిగా (పీకే) చందు సాయి ఓ రేంజ్‏లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్‍కు పర్ఫెక్ట్ ఇన్సులెన్సర్ అంటేనే పక్కింటి కుర్రాడు అనే ఒకనోక టైంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా చెప్పాడు. ఇక చందు సాయి (Chandu Sai) వీడియోల కోసం సోషల్ మీడియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా పక్కింటి కుర్రాడు వీడియోలు యూట్యూబ్‏లో కనిపించడం లేదు. దీంతో ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకోచ్చాడు చందుసాయి. (Pakkinti Kurradu)

ప్రస్తుతం తను ఇంత పాపులర్ అవ్వడానికి కారణమైన వాళ్లతోనే కొన్ని చిన్నచిన్న గొడవల కారణంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసినట్టు చెప్పుకోచ్చాడు. నేను ఇంతకు ముందు పనిచేసిన సంస్థ గురించి ఎక్కడా మాట్లాడకూడదని వాళ్లు నాతో అగ్రిమెంట్ రాయించుకున్నారు. అయితే మా మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చాయి… అవేం కేసుల వరకు వెళ్ళలేదు.. ఈ క్రమంలోనే ఆ సంస్థ వాళ్లు నాకు ఫ్లాట్ ఆఫర్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.. కానీ వాటిలో నిజం లేదు. అలాగే ఇప్పుడు నేను వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడానుకోవడం లేదు. వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక… టైం.. డబ్బు కూడా నా దగ్గర లేదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి ఉన్నా.. నేను ఫైట్ చేసేవాడిని అంటూ చెప్పుకోచ్చాడు. నేను ఆ సంస్థ వాళ్లనే ఇంత పాపులర్ అయ్యాను. అందుకే దీన్ని ఇంకా వివాదం చేయదల్చుకోలేదు. ప్రస్తుతం నా జర్నీ చందుగా మొదలు పెట్టాలనుకుంటున్నాను అంటూ చెప్పారు.

ఇక సోషల్ మీడియాలో నా సంపాదన గురించి అనేక వార్తలు వస్తున్నాయి. నేను రూ.2 కోట్లు సంపాదిస్తున్నానని.. నాకు పెద్ద బంగ్లా ఉంది.. కారు ఉందని అనేక రకాలుగా ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. కానీ నాకు అంత సీన్ లేదు.. అవన్నీ నిజం కాదు అంటూ చెప్పుకోచ్చాడు. నాకు క్లాప్ కోట్టడం అంటే ఇష్టం. అలాగే నాకు పాపులారిటి ఇష్టం.. కానీ డబ్బు ముఖ్యం కాదు. నా నటనకు గుర్తింపు వస్తే చాలు అనుకుంటా.. అలాగే నాకు సొంతంగా ఓ ఇల్లు కోనుక్కోవాలనుంది. దానిని మా అమ్మా నాన్నలతో ఓపెన్ చేయించాలి. కానీ ఇప్పటి వరకు నా డ్రీమ్ అక్కడే ఆగిపోయింది అంటూ చెప్పుకోచ్చాడు చందుసాయి.

Also Read: ‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…