‘శాకుంతలం’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్…

Shakunthalam: అక్కినేని సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'శాకుంతలం'.

  • Rajitha Chanti
  • Publish Date - 2:34 pm, Wed, 7 April 21
'శాకుంతలం' నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. సమంతకు ఇష్టసఖిగా రానున్న ఆ హీరోయిన్...
Shakulantam

Shakunthalam: అక్కినేని సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమాలో సమంతకు జోడిగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోషన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన సమంత ప్రీ లుక్‏కి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ మూవీకి సంబందించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శకుంతలకు ప్రియంవద అనే ఇష్టసఖి ఉంటుందట. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించబోతుందని.. తనేవరో కాదు.. మన తెలుగమ్మాయి ఈషా రెబ్బాను అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇందులో ముందుగా ఈసా రెబ్బాను సెలక్ట్ చేసుకున్న కానీ…. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇప్పుడు ఆమెను కాకుండా తమిళ నటి అదితి బాలన్‏ను (Adithi Balan) తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అదితి బాలన్ తమిళంలో ‘అరువి’ అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో ఆమె నటన నచ్చిన గుణశేఖర్.. శాకుంతలంలో ప్రియంవద పాత్ర కోసం ఆమెను ఎంచుకున్నాడట. ఇక ఇదే నిజమైతే… అదితి బాలన్ ఈ మూవీతోనే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను గుణా టీమ్ వర్క్స్ బ్యానర్‌పై గుణశేఖర్ సతీమణి నీలిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హావా.. బన్నీ కోసం ఒకేసారి రంగంలోకి దిగిన 46 మంది సెలబ్రెటీలు…

Premi Vishwanath: సోషల్ మీడియాలో వంటలక్కకు చేదు అనుభవం.. నయనతారతో పోల్చుతూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. ‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..