Chiranjeevi Rare Record: మెగాస్టార్ ఖాతాలో అనేక రికార్డ్స్.. కానీ ఈ రికార్డ్ ను ఏ హీరో ఎప్పటికీ బ్రేక్ చేయలేడు.. చిరుకే సొంతం
Chiranjeevi Rare Record: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయం కృష్టితో ఎదిగిన హీరో.. విలన్ గా, నలుగురిలో ఒకడిగా అనేక పాత్రలను పోషిస్తూ.. తనకంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక పేజీని లిఖించుకున్నారు...
Chiranjeevi Rare Record: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయం కృష్టితో ఎదిగిన హీరో.. విలన్ గా, నలుగురిలో ఒకడిగా అనేక పాత్రలను పోషిస్తూ.. తనకంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒక పేజీని లిఖించుకున్నారు. అప్పటి వరకూ ఉన్న సినిమాకు బ్రేక్ డ్యాన్స్ , ఫైట్స్ తో ఫీట్స్ అంటూ సరికొత్త ఒరవడిని సృష్టించాడు.. హీరో కి హీరోయిజాన్ని అద్ది.. అభిమానుల అలరించారు.
ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకున్న చిరంజీవి ఖాతాలో అనేక రికార్డ్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని రికార్డ్స్ కాలక్రమంలో బీట్ చేసి.. సరికొత్త రికార్డ్స్ ను నెలకొల్పుతూనే ఉన్నారు యంగ్ హీరోలు.. అయినప్పటికీ ఒక రికార్డ్ మాత్రం చిరంజీవి ఖాతాలో ఉంది. ఆ రికార్డ్ ను భవిష్యత్ లో ఏ హీరో కూడా బ్రేక్ చేయడం కష్టమని అంటున్నారు. మరి ఆ రికార్డ్ ఏమిటో తెలుసా..!
చిరంజీవి సరసన రాధా, సుహాసిని, విజయశాంతి, రాధికా , ఇలా అనేక మంది హీరోయిన్లతో నటించారు. అయితే అక్కా చెల్లెల్లు ఐన రాధా అంబిక లతో పాటు నటించిన చిరంజీవి మరో అక్కచెల్లెళ్ళతో కూడా జత కట్టారు. ఆ అక్కాచెల్లెళ్లు ఎవరంటే.. నగ్మా, జ్యోతిక, రోషిణి. నగ్మాతో చిరంజీవి ‘ఘరానా మొగుడు’, ‘రిక్షావోడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’లో కలిసి నటించారు. ఇక జ్యోతికతో ‘ఠాగూర్’ చిత్రంలో చిరు ఆడిపాడగా.. రోషిణితో ‘మాస్టర్’ చిత్రంలో రొమాన్స్ చేశారు.
అయితే ఈ అక్కా చెల్లెళ్లలో నగ్మా రాజకీయాల వైపు చూస్తూ.. నటనకు దూరంగా ఉంది. రోషిణి కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంది. అయితే పెళ్లి తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న జ్యోతిక మాత్రమే మళ్ళీ నటిస్తుంది. దీంతో ఇక భవిష్యత్ లో చిరంజీవి రికార్డ్ ను బ్రేక్ చేయడం ఏ హీరో వల్లకాదన్నమాట.
Also Read: తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు తెచ్చే బొద్దింకల వ్యాపారం.. లక్షల్లో సంపాదన
రోజూ త్వరగా అలసిపోతున్నారా..అయితే అవయవాలు విశ్రాంతిని కోరుతున్నాయి.. ఈ ఆసనం ట్రై చేయండి