Shavasana: రోజూ త్వరగా అలసిపోతున్నారా..అయితే అవయవాలు విశ్రాంతిని కోరుతున్నాయి.. ఈ ఆసనం ట్రై చేయండి

మనిషి ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి మన పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పరచాయి. శారీరక దృఢత్వం కోసం యోగా.. మానసిక సంతోషం కోసం ధ్యానం ను సూచించారు. యోగ, ధ్యానాన్ని మానవాళికి గిఫ్ట్ గా...

Shavasana: రోజూ త్వరగా అలసిపోతున్నారా..అయితే అవయవాలు విశ్రాంతిని కోరుతున్నాయి.. ఈ ఆసనం ట్రై చేయండి
Shavasana
Follow us

|

Updated on: Apr 07, 2021 | 10:18 AM

Shavasana : మనిషి ఆరోగ్యంగా సంతోషంగా జీవించడానికి మన పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పరచాయి. శారీరక దృఢత్వం కోసం యోగా.. మానసిక సంతోషం కోసం ధ్యానం ను సూచించారు. యోగ, ధ్యానాన్ని మానవాళికి గిఫ్ట్ గా మన పూర్వీకులు ఇచ్చారు. ఈరోజు యోగాసనాలలో ఒకటైన శవాసనం గురించి ఉపయోగాల గురించి తెలుసుకుందాం..!

యోగాలో ఒక విధమైన ఆసనము శవాసనము. శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండటం వల్ల ఈ ఆసనానికి శవాసనం అని పేరువచ్చింది. దీనిని ‘శాంతి ఆసనం’, ‘అమృతాసనం’ అని కూడా అంటారు. దీనివల్ల శరీరంలో అలసట తగ్గుతుంది. అన్ని అవయవాలు విశ్రాంతిని పొందుతాయి.

శవాసనం వేయు పధ్ధతి:

*ముందుగా వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు విడివిడిగా దూరంగా ఉంచాలి. *అరచేతులు పైకి ఉండాలి. *శరీరంలోని ఇతర భాగాలను వదులుగా ఉంచాలి. *శ్వాసను మెల్లగా పీల్చి వదలాలి. మెల్లగా పీల్చి, దానికి రెట్టింపు సమయం వదలటానికి తీసుకోవాలి. * శ్వాస పీల్చినప్పుడు పొట్టను కూడా నింపి, వదలినప్పుడు పొట్టను, ఊపిరితిత్తులను ఖాళీచేయాలి. *శ్వాసలో ఎటువంటి శబ్దం రాకూడదు. *ఈ ఆసనం వేయు సమయంలో శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.

ఉపయోగాలు:

శరీరము యెక్క వునికిని కొంత సేపు మరచి ఉండాలి. అందు వలన మనస్సు శరీరము పూర్తిగా విశ్రాంతి పొంది తిరిగి ఎక్కువ శక్తి వంత మగును. ఈ ఆసనం వేయువారు మృతుని వలె చైతన్యమును వీడి ఉంటారు.. అందుకనే ఈ ఆసనాన్ని మృతాసనమని, శవాసనమని పిలుస్తారు.

Also Read: అక్కడ వింత ఆచారం.. అమ్మవారికి చెప్పుల నైవేద్యం.. రాత్రి దేవత చెప్పులు వేసుకుని గ్రామంలో తిరుగుతుందని నమ్మకం